E-Paper
Advertisement

ఏపీలో స్టైఫండ్ వార్..!

ఏపీలో స్టైఫండ్ వార్..!
Advertisement

Junior Doctors Strike: స్టెతస్కోప్ పట్టాల్సిన చేతులు.. నిరసన ప్లకార్డులు పట్టాయి. ఏపీలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు మళ్లీ పడకేసాయి. స్టైఫండ్ పెంపుకోసం జూడాల నిరసన ఒకవైపు.. దిక్కుతోచని స్థితిలో చిన్నపిల్లలను భుజాన వేసుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న పేదల ఆవేదన మరోవైపు. కనీసం మందుబిళ్ల ఇచ్చేనాథుడు లేక ప్రభుత్వ ఆస్పత్రుల గుమ్మాల దగ్గర నిరుపేదలు అల్లాడిపోతున్నారు. మా ప్రాణాలు తీసి మీ డిమాండ్లు సాధించుకుంటారా అని ఆస్పత్రి వార్డుల్లోంచి రోగుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా సమ్మెను ఆయుధంగా మార్చుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల పన్నుల డబ్బుతో చదువుకుంటున్న వైద్యులకు బాధ్యత లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Advertisement

 తెల్ల కోటు వెనుక వేదన..

కానీ.. ఆ తెల్ల కోటు వెనుక ఉన్న వేదనను కూడా కాదనలేం. 24 గంటలు విధుల్లో నలిగిపోతూ.. ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న ఆ యువ వైద్యుల శ్రమకు తగిన గుర్తింపు ఏది? ఇస్తామన్న స్టైఫండ్ బకాయిలను ఎగ్గొడుతుంటే… మేమెలా బతకాలంటూ ఆవేదనతో వాళ్లూ రోడ్డెక్కారు. సమ్మెల దాకా పరిస్థితిని తెచ్చిన పాలనా యంత్రాంగం అలసత్వాన్ని కూడా తప్పుపట్టాల్సిందే. వ్యవస్థ చేసిన నిర్లక్ష్యానికి… ఇటు జూనియర్ డాక్టర్లు.. అటు పేద రోగులు ఇద్దరూ బలైపోవడం ఇక్కడ విషాదం.

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×