E-Paper
Advertisement

స్కూటీపై ఐదుగురు మైనర్ల డేంజరస్ రైడ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!

స్కూటీపై ఐదుగురు మైనర్ల డేంజరస్ రైడ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!
Advertisement

Minor Driving: మైనర్ల డ్రైవింగ్ రోజురోజుకూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎంతమంది ప్రాణాలు పోతున్నా, పోలీసులు కఠినంగా హెచ్చరిస్తున్నా కొందరు యువకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తాజా ఘటనలే అందుకు సజీవ నిదర్శనం. హైదరాబాద్‌లోని నాంపల్లి, లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో ఓ స్కూటీపై ఏకంగా ఐదుగురు మైనర్లు ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కనిపించారు. అది బైకో లేక ఆటోనో అర్థంకాని రీతిలో వారు చేసిన ఈ విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానికులు పద్ధతి మార్చుకోవాలని ప్రశ్నిస్తే, ఆ కుర్రాళ్లు వెటకారపు సమాధానాలు ఇస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరింత ఆందోళనకరం.

Advertisement

పిల్లలు సరదా కోసం అడుగుతున్నారని తెలిసి కూడా బైక్‌లు, కార్ల తాళాలు చేతికిస్తున్న తల్లిదండ్రుల వైఖరే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ముప్పులోకి నెడుతున్న ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులు కేవలం చలానాలతో సరిపెట్టకుండా, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇస్తే తప్ప ఈ ప్రాణాల రాకపోకలకు అడ్డుకట్ట పడదు.

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×