E-Paper
Advertisement

Kondagattu Anjaneya Temple: కొండగట్టు అంజన్నకు నోటీసులు.. 15 రోజుల్లో..

Kondagattu Anjaneya Temple: కొండగట్టు అంజన్నకు నోటీసులు.. 15 రోజుల్లో..
Advertisement

కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీశాఖ షోకాజ్ నోటీసు ఇచ్చింది. షోకాజ్ నోటీస్ పై ఎండోమెంట్, అటవీశాఖ మౌనం వహించడంపై పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 684 బ్లాక్ లో అటవీశాఖ పరిధి ఆక్రమించారంటూ ఫారెస్ట్ అధికారులు నోటీసులు ఇష్యూ చేశారు. ఏకంగా 6 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని అటవీ శాఖ ప్రధానంగా ఆరోపిస్తోంది.

అటవీ భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ నోటీసులో స్పష్టంగా ప్రకటించింది. ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన కట్టడాలపై నోటీస్ ఇచ్చింది. 6 ఎకరాల విస్తీర్ణంలోనే అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్..
వాహన పూజ షెడ్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేసింది. నాన్ ఫారెస్ట్ కోసం కన్జర్వేషన్ యాక్ట్ 2A ప్రకారం కేంద్ర అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి అంటూ.. నోటీసులో అటవీ శాఖ పేర్కొన్నది.

Advertisement

ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ లోని 3A, 3B సెక్షన్ల కింద ఈ నోటీసులు జారీ చేసింది. లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పురాతన ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీస్ పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Mayor Vijayalakshmi: పేపర్లు చించేసి.. బీజేపీ కార్పొరేటర్లు రచ్చ రచ్చ

Advertisement

 

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×