Nims Hospital: హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అనస్థీషయా వైద్య విద్యార్ధి అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. విద్యార్ధి నితిన్(23) నిమ్స్ హాస్పిటల్లో టెక్నీషియన్ స్టూడెంట్ కోర్స్ చేస్తున్నాడు. ఎప్పటిలానే నితిన్ నిన్న రాత్రి విధులకు హాజరయ్యాడు. ఏం జరిగిందో తెలియదు ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగత జీవిగా పడి ఉండడం స్టాప్ గుర్తించారు. వెంటనే స్టాప్ పోలీసులకు, బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నితిన్ కుటుంబ సభ్యుల ఆ బ్లాక్ దగ్గర రోదిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి నితిన్ ది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.