Charminar Damage: ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ మహానగరంలో ఈదరు గాలులతో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. వర్షం ధాటికి చాలా ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే పురాతన కట్టడం, కుతుబ్ షాహీ కాలంలో నిర్మించిన చార్మినార్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
వివరాల ప్రకారం.. చార్మినార్ కు ఉన్న నాలుగు మినార్ లలో భాగ్యలక్ష్మీ ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి టెంపుల్ పై పెచ్చులు, శిథిలాలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగి భయ బ్రాంతులకు గురైన పర్యాటకలు, జనాలు పరుగులు తీశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. శిథిలాలను, చార్మినార్ మినార్ ను పరిశీలిస్తున్నారు.
ALSO READ: BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే లక్షల్లో జీతం భయ్యా..
గతంలో కూడా చార్మినార్ కు పెచ్చులు పలుమార్లు ఊడితే అధికారులు మరమ్మతులు చేశారు. ఆ మరమ్మతులుగా మరోసారి పెచ్చులుగా రాలాయని తెలుస్తోంది. వర్షం దెబ్బతో చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారులు పరిస్థితి సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను తీసి వేసి అక్కడ క్లీన్ చేశారు. పెచ్చులు ఊడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మినార్‌కు మరోసారి మరమ్మతులు చేస్తామని వారు పేర్కొన్నారు.
అకాల వర్షాల కారణంగా భాగ్యనగరంలో చాలా చెట్లు నేలకు ఒరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షం ధాటికి పలు చోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు రోడ్లపై ప్రయాణించడానికి ఇబ్బంది పడ్డారు.
ALSO READ: CSIR-NAL Jobs: జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. ఈ అర్హతలు ఉంటే సరిపోతుంది..