New Baba Vanga Predictions: 2004లో ఎంత పెద్ద సునామీ వచ్చిందో చూశారుగా.. ఇప్పుడు అంతకుమించి మించిన సునామీ.. జపాన్‌లో రాబోతోందా? ఈ జూలై 5 ఇందుకు ముహుర్తంగా ఫిక్సయ్యిందా? రెండు రోజుల్లో మహాప్రళయం రాబోతుందా? ఈ విపత్తు గురించి ఎవరు హెచ్చరించారు? దీన్ని మనమెలా నమ్మాలి? గతంలో ఎలాంటి ఊహాగానాలు నిజమయ్యాయి? ఇపుడీ జోశ్యం ద్వారా జపాన్ పర్యాటకం ఎలా ప్రభావితమైంది? జపాన్ వాసుల రియాక్షనేంటి? అక్కడి ప్రభుత్వం చెబుతోన్న మాట ఏంటి?
జూలై 5న జపాన్‌లో భారీ భూకంపం
జపాన్‌కి చెందిన న్యూ వంగా బాబా జోష్యం ప్రకారం జూలై 5న జపాన్‌కి భారీ సునామీ రానుంది. దీంతో ఏకంగా 83 శాతం ఫ్లైట్ బుకింగ్స్ రద్దయ్యాయి. ప్రళయం రాక ముందే ఇంతటి భయాందోళనలు సృష్టిస్తుంటే.. వచ్చాక పరిస్థితేంటి? ప్రళయం తర్వాత జరిగే ప్రాణ ఆస్తి నష్టాల విలువ ఎంత స్థాయిలో ఉంటుంది? బాబోయ్ ఊహించుకోడానికే భయంగా ఉంది.
ఊహాగానమేనా.. లేక ముందస్తు హెచ్చరికనా?
న్యూ బాబా వంగా గతంలో కొన్ని కీలక సంఘటనలను.. ముందే ఊహించి చెప్పినట్టు వార్తలు కూడా ఉన్నాయి.
– 2011 ఫుకుషిమా అణు ప్రమాదం
– 2020 కోవిడ్-19 మహమ్మారి
ఈ రెండూ ఆమె చెప్పినట్టే జరిగాయని చెబుతున్నారు.
కోవిడ్- 19 వస్తుందని చెప్పింది నిజమైంది
న్యూ బాబా వంగా.. ‘ద ఫ్యూచర్ ఐ సా’ అనే తన పుస్తకం ద్వారా కోవిడ్- 19ని అంచనా వేశారు. చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఖచ్చితంగా అదే నెలలో కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2025 జూలైలో జపాన్‌కి ఒక భారీ విపత్తు సంభవించబోతున్నట్టు చెప్పారు. దీంతో జపనీయుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అది జరిగినట్టు ఇదీ జరిగితే అన్న టెన్షన్‌తో గజగజ ఒణికిపోతున్నారు.
సముద్ర గర్భంలో పెరిగిన టెన్షన్
అసలేం జరగబోతోంది? ఆమె చెప్పిన దాని ప్రకారం ఎక్కడ ఈ విపత్తు జరగబోతోంది? జపాన్-ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో పగుళ్లు ఏర్పడి, టోహోకు భూకంపం కన్నా మూడు రెట్లు.. అధిక తీవ్రత కలిగిన అలలు తీరానికి ఎగసిపడతాయని వర్ణిచింది న్యూ బాబా వంగా. దీంతో హాంకాంగ్ ఎయిర్‌లైన్స్ జూలై, ఆగస్టులో కగోషిమా, కుమామోటో వంటి నగరాలకు.. సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.
జపాన్ ప్రభుత్వం స్పందన
జపాన్ ప్రభుత్వ విపత్తు నిర్వహణ శాఖ ఈ జోష్యాలను.. వాస్తవాలకు భిన్నమైన ఊహాగానాలుగా పేర్కొంది. ప్రజలను శాంతంగా ఉండమని, కానీ ఎప్పటిలాగే ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది. అధికారికంగా ఎలాంటి అకాల ప్రకంపనల హెచ్చరికలేదని స్పష్టం చేసింది.
జపనీయుల ఆవేదన – నాటి జ్ఞాపకాలు
2011 ఫుకుషిమా విపత్తు.. ఇప్పటికీ జపాన్ ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిపోయిన విషాద ఘట్టం. ఆ సంఘటనను మరోసారి గుర్తుకు తెచ్చుకుంటూ.. ప్రజలు ఇంటి వద్దే ఉండటానికి, సహజ విపత్తు బ్యాగులు సిద్ధంగా ఉంచుకునేందుకు రెడీ అవుతున్నారు.
మనం నమ్మాలా?
న్యూ బాబా వంగా చెప్పింది ఒక ఊహ, కాని గత కాలం ఆధారంగా కొన్ని నిజమవ్వడం వల్ల ఇది భయాన్ని కలిగిస్తోంది. శాస్త్రీయంగా ఎలాంటి భూకంప హెచ్చరిక ఇప్పటికీ అధికారికంగా ఇవ్వలేదు. కానీ జపాన్ వంటి దేశంలో ప్రజలంతా తమ భద్రత కోసం ముందుగానే తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: ఈ అమ్మాయి నోటిలో 81 దంతాలు, ఆ చిన్ని నోటిలో అన్ని ఎలా పట్టాయో?
పర్యాటకం ధ్వంసం – ఆర్థిక దెబ్బ
ఈ హెచ్చరిక కారణంగా ఇప్పటికే జపాన్ పర్యాటకం ప్రభావితమైంది. జపాన్ లో ఏప్రిల్, మే వసంతకాలంలో చెర్రీ బ్లోసమ్ సీజన్ నడుస్తుంది. దీన్ని ఆస్వాదించడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. గతంతో పోలిస్తే సగానికి సగం ఈ సెలవుల పర్యాటకం తగ్గినట్టు చెబుతున్నాయి హాంకాంగ్ ట్రావెల్ ఏజెన్సీలు.