Hyderabad News: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో రోడ్ల మీద వెళ్లేవారిపై వీరంగం సృష్టిస్తున్నారు. ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఇద్దరు యువకులు చిందులేశారు. అంతేకాదు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. వారి బెదిరింపులకు భయపడ్డారు క్యాబ్‌లోని ఐటీ ఉద్యోగులు.
దేనికైనా హద్దు పద్దు ఉంటుంది. కాస్త శృతిమించితే దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. హైదరాబాద్ శివారులో పని పాటా కొందరు యువకులు రెచ్చిపోయారు. వారిలోని కోపాన్ని ఒక్కసారిగా ప్రదర్శించారు. ఆ యువకుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. అసలేం జరిగింది. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ శివార్లలో బైక్‌లపై నానా హంగామా చేస్తుంటారు కొందరు యువకులు. బైక్‌లతో ఫీట్లు చేసేవారు కొందరైతే.. ఇంకొందరు రేసింగ్ మొదలుపెడతారు. ఆదివారం రాత్రి ఉప్పల్ ఎక్స్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో క్యాబ్ డ్రైవర్ హారన్ కొట్టాడు.
కారు డ్రైవర్ హారన్ కొట్టడంపై రెండు యువకులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కారుని బైక్‌తో ఛేంజ్ చేశారు ఆ యువకులు. క్యాబ్ డ్రైవర్‌పై గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా కారు డోర్ తెరిచి అందులోఉన్న ఐటీ ఉద్యోగులపై దాడి చేసే ప్రయత్నం చేశారు. పోకిరీల చేష్టలతో భయపడిపోయారు.
ALSO READ: కెనడాలో అలా చేస్తూ దొరికిన భారత జంట.. వీడియో వైరల్
బాధితులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోకిరీలను గుర్తించే పనిలో పడ్డారు. ఉద్యోగులను ఐటీ ఆఫీసుకు తీసుకెళ్తున్నాడు క్యాబ్ డ్రైవర్.
Drunk youths chased and attacked a #cab carrying #ITemployees near #Uppal X Roads last night after a #honkingrow.
They even waited outside the #police station to attack again but fled seeing cops.
Case registered. Investigation on.#Crime pic.twitter.com/U0VwcDMUWl
— NewsMeter (@NewsMeter_In) July 14, 2025