BigTV English

Facts about AP: ఇండియాకు ఏపీ ఇన్ని అందిస్తోందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

Facts about AP: ఇండియాకు ఏపీ ఇన్ని అందిస్తోందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

దేశంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కూరగాయలు, పండ్లు, ధాన్యం, సహజ వనరులు దేశానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇంతకీ ఇండియాకు ఆంధ్రా నుంచి ఏమేం అందుతున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


75 శాతం ఫామ్ ఆయిల్, 90 శాతం రెడ్ శాండిల్

దేశానికి సుమారు 75 శాతం ఫామ్ ఆయిల్ అందుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా ఏపీలో ఫామ్ ఆయిల్ సాగు పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పంటను పండించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దేశానికి కావాల్సిన 90 శాతం రెడ్ శాండిల్ ఏపీ నుంచే లభిస్తోంది. ఆంధ్రాలో ఎర్ర చందనం సాగు విపరీతంగా ఉంది. ఆంధ్రాలో విస్తరించి ఉన్న అడవులలోనూ విపరీతంగా రెడ్ శాండిల్ లభిస్తోంది. ఇక విశాఖ నుంచి 60 శాతం ఎండు మిర్చి లభిస్తోంది. గుంటూరు నుంచి కూడా మిర్చి ఎక్కువగా అందుతోంది. ఇక చిత్తూరు నుంచి దేశానికి కావాల్సిన 30 శాతం టమాట లభిస్తోంది. అనంతపురం నుంచి 30 శాతం బొప్పాయి అందుతోంది. కృష్ణా నుంచి 20 శాతం బాస్మతి రైస్ లభిస్తోంది.


విస్తారంగా సహజ వనరులు

కృష్ణా, గోదావరి బేసిన్ నుంచి పెట్రోలియం, నేచురల్ గ్యాస్, గోల్డ్ గనులు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రా నుంచి గ్యాస్, పెట్రో ఉత్పత్తులు గుజరాత్ వరకు సరఫరా చేయబడుతున్నాయి. బంగారు నిక్షేపాలు కూడా విస్తృతంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

కోహినూర్ డైమండ్ కూడా ఆంధ్రాకు చెందినదే!

ఇక ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ డైమండ్ కూడా ఆంధ్రాకు చెందినదే. లోగ్కొండ మైన్స్ నుంచి ఈ మేలిమి డైమండ్ ను వెలికి తీసి సానబెట్టారు. భారత జాతీయ పతాక రూపశిల్పి కూడా ఆంధ్రాకు చెందిన వ్యక్తే. కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ పతాకాన్ని తొలిసారి రూపొందించారు. ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో కొత్త జెండాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్రా నుంచి ఎంతో మంది ఉన్నారు. వారిలో అల్లూరి సీతారామ రాజు ముఖ్యుడు. తన విల్లంబులతో బ్రిటిష్ సేనలకు చుక్కలు చూపించాడు అల్లూరు.

Read Also: పక్కన కూర్చోవడానికీ ఇష్టపడలేదు, ఇప్పుడు అతడో వరల్డ్ సెలబ్రిటీ!

ఫార్మా దిగ్గజాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు

ఇక ఫార్మా రంగంలో దిగ్గజాలుగా కొనసాగుతున్న డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్ అధినేతలకు కూడా ఆంధ్రాకు చెందిన వాళ్లే. ప్రస్తుతం ఈ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఫార్మా ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి కూడా ఆంధ్రాలోనే ఉంది. నిత్యం ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు.  జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లిఖార్జున స్వామి కూడా ఆంధ్రాలోనే ఉంది. చెప్పుకుంటూ వెళ్తే ఆంధ్రా గురించి ఎంతో ఉంది.

Read Also:  ఒక్క ఫ్లైట్ టికెట్ కొని రూ. 75 లక్షల ఫుడ్ తినేశాడు, అదీ ఫ్రీగా!

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×