Ghost footprints video: సాధారణంగా నేలపైనే ఏవైనా మనిషి జాడ లేకుండా కేవలం అడుగులు కనిపిస్తే, ఆ భయాందోళన వేరు. ఆ దారిలో నడవాలన్నా మనం భయపడిపోతాం. అందుకు కారణం.. మనిషి లేకుండా అడుగు జాడలు ఎక్కడివి? ఇదే మనకు మన మదిలో తొలిచే మొదటి ప్రశ్న. కానీ ఈ వీడియోలో మాత్రం ఇంకాస్త భయానకం, ఆశ్చర్యం కలుగకమానదు. అందుకు కారణం ఏమిటో మీరే తెలుసుకోండి. అయితే ఈ పూర్తి కథనం తప్పక చదవండి.
ఎక్కడైనా మనకు తెలిసిన ప్రదేశంలో దెయ్యాలు భూతాలు ఉన్నాయని, మనకు ఎవరైనా చెబితే.. కాస్త ధైర్యంగా ఉన్నా.. లోలోపల భయం కామన్. అలాంటి ఘటనే ఇది. ఈ ఘటన ఏ మేరకు వాస్తవమో ఏమో కానీ, ఇప్పుడు సోషల్ మీడియా ఈ వీడియో ఊపేస్తుంది. నెటిజన్స్.. అయితే కొందరు భయపడుతున్నారు. మరికొందరు ఇదంతా ఫేక్ అనేస్తున్నారు.
అసలు వీడియోలో ఏముందంటే..
ఎక్కడైనా మనకు కింద నేలపై అడుగులు కనిపించడం కామన్. ఈ వీడియోలో మాత్రం అంతా వ్యతిరేకం. భవనానికి గల సీలింగ్ పై అడుగులు కనిపించాయి. అది కూడా అచ్చం మనిషి అడుగులను పోలిన అడుగులు. అంతేకాదు.. ఆ అడుగులు కూడా ఎర్రటి రంగులో ఉండడంతో.. వీడియో చూస్తే భయం అనిపించకమానదు.
ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ లో గల మొహల్ బానీ ఘాట్ వద్ద వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అసలే దెయ్యాలు, భూతాలు ఉన్నాయని భయపడే ఆ గ్రామంలో.. ఇలా సీలింగ్ పై మనిషి అడుగులు కనిపించడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఇదేం దెయ్యం రా బాబు.. అంతా రివర్స్ నడిచింది అంటూ కొందరు కామెంట్స్ చేయగా, మరికొందరు ఆ దారిన వెళ్లడమే మానుకున్నారట.
సోషల్ మీడియాలో వైరల్..
అయితే స్థానికులు ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ గా మారింది. ఇవి ఖచ్చితంగా దయ్యం అడుగులే అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు కావాలనే ఇటువంటి చర్యలకు ఎవరో పూనుకున్నారని దయ్యం భయాందోళనలను కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా మనిషి అడుగుల వలె సీలింగ్ పై అడుగులు ఉండడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
Also Read: Railway track marriage: రైలు పట్టాలకు పెళ్లి.. ఇక్కడ ఇదో వెరైటీ.. వీడియో వైరల్!
ఇలాంటి ఘటనలు గతంలో కొన్ని హారర్ పబ్లిసిటీ స్టంట్స్ గా బయటపడిన సందర్భాలున్నాయి. దీన్ని కూడా అలా అర్థం చేసుకోవాలా? లేక నిజంగా అణచివేతకు గురవుతున్న ఓ భయానక రహస్యమా? అనేది నెటిజన్ల చర్చకు ఆజ్యం పోస్తోంది. కొన్ని కామెంట్లు చూస్తే.. ఇది సైకలాజికల్ హాల్‌న్యూసినేషన్, ఇది బ్లడ్ నోట్స్ ప్రాంక్, ఫేక్ బ్లడ్‌తో చేసిన చిల్లర దెయ్యాలాట అంటూ వేరే వేరే థియరీస్ వినిపిస్తున్నాయి.
విజ్ఞానాన్ని నమ్మాలా..? అనుభవాన్ని నమ్మాలా..?
వీడియోను గమనిస్తే.. సీలింగ్ చాలా పాతది కాదు, శుభ్రంగా ఉంది. ఆ పై ఎవరైనా నడవగలిగే అవకాశమే లేదు. మరి ఈ అడుగుల అచ్చులేంటి? రక్తపు ముద్రలా కనిపించడమే భయానకం. ఒకవేళ ఇది ఫేక్ అయితే ఎవరు చేశారన్నదే ప్రశ్న. నిజం అయితే… మనుషుల విజ్ఞానం కూడా ఓ హద్దులో నిలిచిపోయేంత అజ్ఞాతం!
https://x.com/27stories_/status/1944951550700581134?t=o0uLKFCbSVzHFZLTf4ouWw&s=19
మీ అభిప్రాయమేమిటి?
ఈ వీడియో చుట్టూ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఇది నిజంగా దెయ్యం అడుగులా? లేక ఇంకా ఏదైనా ఉందా? అర్థంకాకున్నా వైరల్ మాత్రం అయింది. సైన్స్ ఆధారంగా చూసినా, మనసు చెప్పే భయంతో చూస్తేనూ.. ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఒక ప్రశ్న గుర్తుకు తీసుకురావడం ఖాయం.