BigTV English

Gujarat Tragedy: కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Gujarat Tragedy: కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Gujarat Tragedy News: కంటికి రెప్పలా పెంచుకున్న పిల్లలు కళ్ల ముందే చనిపోతే, తట్టుకోవడం ఏ తల్లింద్రడికి సాధ్యం కాదు. వారి బాధను వర్ణించలేం. ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి. తాజాగా గుజరాత్ లోనూ ఇలాంటి ఘటన జరిగింది. కళ్ల ముందే కన్న కొడకు చనిపోతే, ఆ తల్లిదండ్రులు చేసిన పని చూసి అందరూ కంటతడి పెట్టారు. అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఆనంద్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువకుడు క్రిష్ పర్మార్‌ ఇటీవలే 12వ తరగతి పరీక్షల్లో పాసయ్యాడు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA) ప్రోగ్రామ్‌లో చేరాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే తను జాయిన్ కావాలనుకున్న కాలేజీకి వెళ్లాడు. వెళ్లి తన సర్టిఫికేట్స్ చూపించాడు. చేరాలనుకున్న కోర్సు గురించి వివరాలు తెలుసుకున్నాడు. అన్ని ఓకే అనుకున్నాక ఆడ్మిషన్ తీసుకుని జాయిన్ అయ్యాడు. మరికొద్ది రోజుల్లోనే కాలేజీ స్టార్ట్ కానున్నట్లు కళాశాల సిబ్బంది చెప్పారు. హ్యాపీగా తన బైక్ మీద ఇంటికి బయల్దేరాడు. కాలేజీ నుంచి కొద్ది దూరం రాగానే ఊహించని ఘటన జరిగింది.  అతడి బైక్ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పర్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అడిని హాస్పిటల్ కు తరలించారు. సుమారు 12 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడు. చివరకు చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయాడు.


Read Also: ఖైరతాబాద్ లో ఆత్మలు, అక్కడ అడుగు పెట్టారో ప్రాణాలు పోయినట్టే!

కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి!

అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోదించారు. చివరకు తమ కొడుకు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్మశాన వాటికకు తీసుకొచ్చారు. సాధారణంగా ఎవరైనా చనిపోయిన వారిని సమాధి చేస్తారు. కానీ, క్రిష్ తండ్రి సంజయ్ పర్మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రిష్ కు మోటార్ సైకిల్ అంటే ఎంతో ఇష్టం. తన ఫ్యామిలీకి కారు ఉన్నప్పటికీ, అతడు బైక్ మీదే ప్రయాణించే వాడు. ఈ నేపథ్యంలో అతడిని ఇష్టాన్ని కాదనకుండా,  క్రిష్ బట్టలు, బూట్లతో పాటు మోటార్‌ సైకిల్‌ ను పక్కనే ఉంచి సమాధి చేయాలి అనుకున్నాడు. బైక్ తో క్రిష్‌ కు ఉన్న ఇష్టాన్ని గౌరవించాలని వాటిని కూడా సమాధి చేయించాడు. ఈ దృశ్యం అక్కడి వారందరినీ ఎంతో ఆవేదనకు గురి చేసింది. సోషల్ మీడియా కూడా ఈ ఘటన పట్ల తమ ఆవేదనను వ్యక్తం చేసింది. క్రిష్ కు ఒక తండ్రిగా ఆయన ఫాదర్ చేయాల్సిన పని చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరే తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని కామెంట్స్ పెడుతున్నారు.

Read Also: ఖైరతాబాద్ లో ఆత్మలు, అక్కడ అడుగు పెట్టారో ప్రాణాలు పోయినట్టే!

Related News

Viral video: తాళి కడతావా లేదా? కట్టకుంటే వి*ప్పేస్తా.. అమ్మాయి వార్నింగ్.. వీడియో వైరల్!

Watch Video: రైల్లో ఊపిరి ఆడక యువతి విలవిల.. శునకానందం పొందిన జనాలు, వీడియో వైరల్!

Bizarre Food: రసం రైస్.. ఐస్‌ఫ్రూట్, తినక్కర్లేదు.. ఏకంగా నాకేయొచ్చు!

Viral News: అక్కడ పెళ్లికి ముందే ఫస్ట్ నైట్.. గుడిసెల్లోకి పంపి మరీ ఎంకరేజ్ చేసే పెద్దలు!

Nita Ambani Car: నీతా అంబానీ స్పెషల్ కారు, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

×