BigTV English

Harley ‘s India Guinness World record: కనీవినీ ఎరుగని హనీ కేక్, గిన్నిస్ రికార్డు నెలకొల్పిన హార్లీస్ ఇండియా

Harley ‘s India Guinness World record: కనీవినీ ఎరుగని హనీ కేక్, గిన్నిస్ రికార్డు నెలకొల్పిన హార్లీస్ ఇండియా

Harley’s India Cake Making: హైదరాబాద్ కు చెందిన పలు ప్రముఖ బేకరీలు ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన కేక్ లు తయారు చేశాయి. పలు రికార్డులను నెలకొల్పాయి. తాజాగా మరో బేకింగ్ కంపెనీ అరుదైన ఘనత సాధించింది. హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద కేక్ ను రూపొందించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించింది.


500 మంది చెఫ్ లు.. అతిపెద్ద కేక్!

భాగ్యనగరానికి చెందిన హార్లీస్‌ ఇండియా బేకరీ కంపెనీ.. తాజాగా కొండాపూర్ లోని మాయా కన్వెన్షన్ సెంటర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద రష్యన్ మెడోవిక్‌ హనీ కేక్‌ ను రూపొందించింది. వాస్తవానికి 3 టన్నుల కేక్ తయారు చేయాలని భావించినా, చివరకు 2,254 కేజీల కేక్ ను తయారు చేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధుల ముందే 500 మంది బేకర్లు, చెఫ్ లు కలిసి ఈ అద్భుతమైన కేక్ ను రెడీ చేశారు. గిన్నిస్‌ రికార్డ్స్‌ టీమ్‌ ఈ అరుదైన ఫీట్‌ కు అధికారిక గుర్తింపు అందించింది. న్యాయనిర్ణేతలుగా ఉన్న రిషి నాథ్,  నిఖిల్‌ శుక్లా కలిసి గిన్నిస్ రికార్డు సర్టిఫికేట్ ను హార్లీస్‌ ఇండియా అధినేత సురేష్ నాయక్ కు సర్టిఫికేట్‌ ను అందజేశారు. హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. అటు సినీ దర్శకుడు చందు మొండేటి, చిన్ని కృష్ణ, హీరో భరత్ రెడ్డి సహా పలువురు ఈ ఈవెంట్ లో పాల్గొని సురేష్ నాయక్ ను అభినందించారు.


సమిష్టికి కృషికి దక్కిన అరుదైన గౌరవం- సురేష్

గిన్నిస్ రికార్డు పొందిన హార్లీస్ ఇండియా సీఈవో సురేష్ సంతోషంలో ముగినిపోయారు. తమ సంస్థ ప్రయాణంలో ఇదో మర్చిపోలేని మైలురాయిగా అభివర్ణించారు. “మేం తయారు చేసిన హనీ కేక్  2,254 కిలోల బరువు ఉన్నది. 7 వెడల్పు,  70 ఫీట్ల పొడవు ఉంది. గతంలో స్పిన్నీస్‌ దుబాయ్‌ కంపెనీ తయారు చేసిన కేక్ తో పోల్చితే ఇది 10 రెట్లు  పెద్దగా ఉంది. కచ్చితంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని ఈ కేక్ తయారీ కార్యక్రమం చేపట్టాం. అనుకున్నట్లుగానే తయారు చేశాం. పక్కా ప్రణాళిక, సమిష్టి కృషి కారణంగానే ఈ రికార్డు నెలకొల్పాం. ఈ ఘనత సాధించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చారు. అటు ఈ కేక్ తయారీ సందర్భంగా  పలు ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు నిర్వహించింది హార్లీస్ ఇండియా. బేకింగ్‌ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసింది.

ఇక గతంలో ప్రపంచంలో అతిపెద్ద కేక్ ను రూపొందించిన కంపెనీగా స్పిన్సీస్ దుబాయ్ గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ ఈ కేకును తయారు చేసింది ఒడిశాకు చెందిన వ్యక్తి కావడం విశేషం. దుబాయ్‌లోని సూపర్ మార్కెట్ చైన్ స్పిన్నీస్‌ లో రఘునాథ్ పూర్ కు చెందిన ప్రీతం పట్నాయక్ చెఫ్ గా పని చేశాడు. మరో 10 మంది స్టాఫ్ తో కలిసి ఆయన.. ఏకంగా 275 కిలోల హనీ కేక్ ను తయారు చేశారు.  దీని పొడవు 4.8 మీటర్లు ఉండగా, వెడల్పు 1.08 మీటర్లు. ఈ కేక్ ను తయారు చేసేందుకు వాళ్లు మూడు రోజుల సమయం తీసుకున్నారు.

Read Also: ఫోన్ చూస్తూ పట్టాల మీదికి.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ యువకుడు!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×