Beer Race Championship 2025: ఈ ఏడాది బీర్ మైల్ వరల్డ్ క్లాసిక్ ఛాంపియన్ షిప్ వేడుకలు పోర్చుగల్ లోని లిస్బన్ లో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మహిళల విభాగంలో ఆస్ట్రియాకు చెందిన రన్నర్ లిజ్ అలియాస్ ఎలిజబెత్ లాసెటర్ దుమ్మురేపింది. గత కొద్ది సంవత్సరాలుగా వరల్డ్ బీర్ మైల్ ఈవెంట్స్ లో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్న ఆమె ఈ ఏడాది కూడా సత్తా చాటింది. బీర్ మైల్ వరల్డ్ క్లాసిక్ 2025 లో లిజ్ (Elizabeth Laseter) మూడవసారి టైటిల్ గెలుచుకుంది. కొత్త ఛాంపియన్ షిప్ రికార్డును నెలకొల్పింది. ఆమె కేవలం 5:56 నిమిషాల్లో గమ్య స్థానానికి చేరకుని విజేతగా నిలిచింది. ఈ పోటీలో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించుకుంది.
ఇంతకీ బీర్ మైల్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీ ఎలా ఉంటుంది?
లిజ్ వరుసగా మూడు సంవత్సరాలుగా ఈ పోటీల్లో విజేతగా నిలవడం పట్ల ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదీ తక్కువ సమయంలో విజేతగా నిలవడం పట్ల హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక బీర్ మైల్ వరల్డ్ క్లాసిక్ అనేది ఏడాదికి ఓసారి జరిగే ఈవెంట్. ఇందులో అథ్లెట్లు ఒక మైలు దూరం అంటే.. 1.6 కిలో మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. పరిగెత్తే సమయంలో ప్రతి క్వార్టర్ మైలు ముందు బీర్లు ఉంటాయి. వాటిని అక్కడే నిలబడి తాగి, మళ్లీ పరుగు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇలా మొత్తంగా మూడుసార్లు తాగాల్సి ఉంటుంది. అలా బీరు తాగుతూ ఎవరైతే ముందుగా గమ్య స్థానాన్ని చేరుతారో వారిని ఛాంపియన్ గా అనౌన్స్ చేస్తారు. నిజానికి ఈ రేస్ లో బీరు ఎంత సేపు తాగారు అనేది కూడా లెక్కిస్తారు. అలాగే ఎవరు ముందు వెళ్లారు అనేది కూడా పరిగణలోకి తీసుకుని విజేతలను ప్రకటిస్తారు.
Read Also: మొదటిసారి శాఖాహారం తిన్న సింహం.. దాని ఎక్స్‌ప్రెషన్ చూస్తే.. గంట నవ్వుతారు!
పురుషుల ఈవెంట్ లో సత్తా చాటిన కోరీ బెల్లెమోర్
ఈ ఏడాది బీర్ మైల్ వరల్డ్ క్లాసిక్ 2025 పోర్చుగల్ లోని లిస్బన్ లో జరిగింది. మహిళల ఈవెంట్ లో లిజ్ లాసెటర్ విజేతగా నిలువగా, పురుషుల విభాగంలోనూ సరికొత్త రికార్డు నమోదయ్యింది. కోరీ బెల్లెమోర్ తన బీర్ మైల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. గతంతో పోల్చితే ఈసారి తక్కువ సమయంలో గమ్యన్ని చేరుకుని విజేతగా నిలిచాడు. ప్రస్తుతం ఈ ఈవెంట్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసి లిజ్ తో పాటు కోరీకి అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు.
Read Also: వీడు ఎవడండి బాబు.. రైల్వే ప్లాట్‌ఫాం మీదకు ఏకంగా కారుతో వచ్చేశాడు!