BigTV English

Bigg Boss 8 Telugu Promo: ప్యారెట్.. డైనోసర్.. హౌజ్‌లో రెచ్చిపోతున్నారుగా!

Bigg Boss 8 Telugu Promo: ప్యారెట్.. డైనోసర్.. హౌజ్‌లో రెచ్చిపోతున్నారుగా!

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో నామినేషన్స్ అనేవి ప్రతీ వారం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా సోనియా వెళ్లిపోవడం వల్ల నిఖిల్, పృథ్విల గేమ్ ప్లాన్ పూర్తిగా మారే ఛాన్స్ ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. నామినేషన్స్ నుండే వారి ఆటతీరు మారిందేమో అని అనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి నామినేషన్స్‌లో ప్రతీ ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం ఖాయమని ఇప్పటివరకు విడుదలయిన ప్రోమోలు చూస్తుంటే అర్థమవుతోంది. తాజాగా విడుదలయిన ప్రోమోలో కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలే ఎక్కువగా కనిపించాయి. నామినేషన్స్‌ను యాక్సెప్ట్ చేయలేక ప్యారెట్, డైనోసార్ అంటూ తిట్టుకోవడం మొదలుపెట్టారు.


మిగిలితేనే తింటాను

ముందుగా విష్ణుప్రియా వచ్చి నైనికాను నామినేట్ చేసింది. ‘‘ఈవారం నువ్వు ఆడిన విధానం నాకు అంతగా నచ్చలేదు’’ అని కారణం చెప్పింది. ‘‘నీకు మాట్లాడడం రాకపోవచ్చు, నీకు గొడవలు పడడం రాకపోవచ్చు, నీకు ఆడడం వచ్చు అనే కారణంతో నన్ను నామినేట్ చేస్తున్నారు’’ అంటూ సీరియస్ అయ్యింది నైనికా. ఆ తర్వాత నబీల్‌ను నామినేట్ చేసింది. దానికి హర్ట్ అయిన నబీల్.. ‘‘రేపటినుండి మీరందరూ ముందు తినండి. చివరికి నేను తింటా. మీరందరూ కడుపునిండా తిన్న తర్వాతే నేను తింటా. ఉంటేనే తింటాను లేకపోతే తినను’’ అని మెల్లగా సమాధానమిచ్చాడు. అలా చెప్పడంతో విష్ణుప్రియా కూడా సైలెంట్ అయిపోయింది.


Also Read: నిఖిల్‌కు నోటిదూల అన్న విష్ణుప్రియా, మంటల్లో చేయి పెట్టిన ఆదిత్య.. ఈవారం నామినేషన్స్ రచ్చ రచ్చే

హార్ట్ బ్రేక్‌తో నామినేషన్

‘‘నేను ఆటను గ్రహించలేదని నన్ను నామినేట్ చేశావు. అలా అంటే నువ్వు కూడా ఎప్పుడూ రియలైజ్ అవ్వలేదు’’ అని కారణం చెప్తూ మణికంఠను నామినేట్ చేసింది యష్మీ. ‘‘నేను రియలైజ్ అవ్వకపోయింటే మొదటి వారమే నేను బయటికి వెళ్లిపోయిండేవాడిని’’ అన్నాడు మణికంఠ. దానికి ‘‘ఎలా సేవ్ అవుతున్నావో నాకు కూడా అర్థం కావడం లేదు’’ అని కౌంటర్ ఇచ్చింది యష్మీ. తనది రివెంజ్ అని గుర్తుచేశాడు మణి. దానికి యష్మీ కూడా ఒప్పుకుంది. ‘‘ఒక ఫ్రెండ్‌గా నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావు’’ అని ఆడియన్స్‌‌కు అరిచి చెప్పింది. ఆ తర్వాత వచ్చిన పృథ్వి కూడా మణికంఠనే నామినేట్ చేశాడు. ‘‘వందసార్లు ప్యారెట్‌ను డైనోసర్ అన్నా కూడా అది డైనోసర్ అవ్వదు’’ అంటూ తన మాటలను తాను సమర్ధించుకున్నాడు పృథ్వి.

రెచ్చగొడితే ఏం చేస్తావు

అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు అనే కారణంతో మణికంఠను నామినేట్ చేశాడు పృథ్వి. నామినేట్ చేసి పక్కకు వెళ్లి కూర్చున్న తర్వాత కూడా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. అందుకే రెచ్చగొట్టకు అంటూ పృథ్వికి వార్నింగ్ ఇచ్చాడు మణి. రెచ్చగొడితే ఏం చేస్తావంటూ రివర్స్ అయ్యాడు పృథ్వి. దీంతో ఏం మాట్లాడలేక పృథ్వికి యాటిట్యూడ్ అంటూ సైలెంట్ అయిపోయాడు మణి. వ్యంగ్యంగా థాంక్యూ చెప్పి తాను కూడా సైలెంట్ అయిపోయాడు పృథ్వి. అలా వారమంతా జరిగిన టాస్కులను, వారి మధ్య వచ్చిన మనస్పర్థలను గుర్తుపెట్టుకొని ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ నామినేషన్స్‌లో రచ్చ చేశాడు కంటెస్టెంట్స్.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×