BigTV English

Self Surgery: మత్తు లేకుండా.. కడుపు కోసుకుని.. తనకి తానే సర్జరీ చేసుకున్న ఈ డాక్టర్ గురించి తెలుసా?

Self Surgery: మత్తు లేకుండా.. కడుపు కోసుకుని.. తనకి తానే సర్జరీ చేసుకున్న ఈ డాక్టర్ గురించి తెలుసా?

సర్జరీ అంటే మాటలు కాదు.. రోగికి అదొక పెయిన్‌ఫుల్ అనుభవం. డాక్టర్‌కైతే.. అది ఒక ఛాలెంజింగ్ టాస్క్. కొందరికైతే చేతులు వణుకుతాయి. అంతేకాదు.. చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి. తేడా జరిగితే రోగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అందుకే, కొన్ని సర్జరీల్లో డాక్టర్‌తోపాటు ఇద్దరు ముగ్గురు మెడికల్ స్టాఫ్ కూడా ఉంటారు. క్లిష్టమైన ఆపరేషన్లకైతే అదనంగా డాక్టర్లు కూడా ఉంటారు. రోగి ఆపరేషన్ సక్సెస్ అయ్యేవరకు టెన్షనే. మరి డాక్టర్‌కు సర్జరీ అవసరమైతే? ఏం ఉంది ఇంకో డాక్టర్ వచ్చి సర్జరీ చేస్తాడులే అనే కదా మీరు అనుకుంటున్నారు. అయితే, రష్యాకు చెందిన ఓ డాక్టర్ అలా చేయలేదు. తనకి తానే సర్జరీ చేసుకుని ఆశ్చర్యపరిచాడు.


ఏమైంది? తనకే తానే ఎందుకు సర్జరీ చేసుకున్నాడు?

రోగికి సర్జరీ చెయ్యడం అంటేనా.. పెద్ద టాస్కు. అలాంటిది ఆ డాక్టర్ మత్తులేకుండా తన పొట్టను కోసుకుని మరీ సర్జరీ చేసుకున్నాడు. ఆ బ్రేవ్ డాక్టర్ పేరు లియోనిడ్ రాగోజావ్. ఈ ఘటన 1961లో చోటుచేసుకుంది. అతడు అంటార్కిటికాలోని నావోలాజరెవస్క్యా స్టేషన్‌లో ఉండేవాడు. అప్పుడు అతడితోపాటు 11 మంత్రి మాత్రమే ఉండేవారు. ఏప్రిల్ నెలలో అక్కడ తీవ్రమైన మంచు కురిసింది. దీంతో అక్కడికి హెలికాప్టర్లు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో లియోనిడ్‌కు కడుపులో తీవ్రమైన నొప్పి ఏర్పడింది. అది భరించలేని నొప్పి.. ఆ టీమ్‌లో అతడు ఒక్కడే డాక్టర్. దీంతో తనకి తానే పరీక్షలు చేసుకున్నాడు. డాక్టర్ కాబట్టి.. తన సమస్య ఏమిటనేది వెంటనే తెలుసుకున్నాడు. అది సాధారణ కడుపు నొప్పి కాదని, అపెండిక్స్ అని తెలియడంతో ఏ మాత్రం ఆలస్యం చెయ్యలేదు. ఎందుకంటే.. ఆ నొప్పి వచ్చిన 24 గంటల లోపు తప్పకుండా సర్జరీ చెయ్యాలి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. అందుకే.. లియోనిడ్ ఆ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.


నొప్పి భరిస్తూ…

వేరే రోగికి సర్జరీ చెయ్యాలంటే.. అతడి ముందుగా మత్తు మందు ఇస్తారు. కానీ, ఇక్కడ సమస్య వచ్చింది డాక్టర్‌కే. పైగా అతడికి అతడే సర్జరీ చేసుకోవాలంటే మత్తు మందు తీసుకోలేడు. తప్పకుండా స్పృహలో ఉండాలి. అందుకే, మత్తు తీసుకోకుండా కేవలం కట్ చేసే ప్రాంతంలో స్పర్శ, నొప్పి తెలియకుండా ఉపయోగించే మందును ఇంజెక్ట్ చేసుకున్నాడు. అలా తన అపెండిక్స్ సర్జరీ మొదలు పెట్టాడు. అది పూర్తయ్యే వరకు అతడు కూర్చొనే ఉన్నాడు. అయితే, ఆ సమయంలో అనుకోకుండా ఒక చిన్న పార్టును కట్ చేసేసుకున్నాడు. వెంటనే గుర్తించి కుట్లు వేసుకున్నాడు. ఎట్టకేలకు తన అపెండిక్స్ తొలగించుకుని.. తిరిగి కుట్లు వేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని మెడిసిన్స్ తీసుకుని విశ్రాంతి తీసుకున్నాడు.

సర్జరీ ఎంత సేపు జరిగిందంటే..

సర్జరీ కోసం లియోనిడ్‌ సుమారు 10 నుంచి 12 సెంటీ మీటర్ల పొడవు వరకు పొట్టను కోసుకున్నాడు. తీవ్రమైన రక్తస్రావం వల్ల చాలా బలహీనం అయిపోయాడు. కళ్లు మసకబారుతున్నా సరే.. సర్జరీని కొనసాగించాడు. ఈ సర్జరీ పూర్తి కావడానికి సుమారు 1 గంట 45 నిమిషాల సమయం పట్టింది. అతడికి ఏమీ కాకుండా తోటి సభ్యులు అతడిని అలర్ట్‌గా ఉంచేవారు. వారిలో కొందరు అతడి సర్జరీని ఫొటోలు కూడా తీశారు. సర్జరీ జరిగిన వారం రోజుల్లోనే లియోనిడ్‌ కోలుకున్నాడు. ఆ తర్వాత కుట్లు కూడా తీసేశాడు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే మళ్లీ పనిలో చేరాడు.

Also Read: ఏంటీ.. బంగాళా దుంప తల్లి టమోటానా? శాస్త్రవేత్తల మైండ్ బ్లోయింగ్ డిస్కవరి

ఇలా ఒక డాక్టర్ తనకు తానే సర్జరీ చేసుకోవడం చరిత్రలో మరెక్కడా జరగలేదు. అందుకే, ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. అతడి ధైర్యానికి మెచ్చి ప్రభుత్వం అవార్డులు కూడా జారీ చేసింది. దీనిపై లియోనిడ్‌ స్పందిస్తూ.. దీన్ని తాను ప్రత్యేకంగా ఏమీ భావించడం లేదని.. ఎదుటి వ్యక్తికి సమస్య వస్తే ఎలా స్పందిస్తానో.. తన కోసం కూడా అలాగే స్పందించానని చెప్పాడు. లియోనిడ్‌ 66 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో లివర్ క్యాన్సర్‌తో చనిపోయాడు. లియోనిడ్‌ వల్ల ప్రభుత్వం అప్రమత్తమైంది. అంటార్కిటికాకు వెళ్లే పరిశోధకులు, సహాయకులు హెల్త్ టెస్టులు చెయ్యడమే కాకుండా.. వారికి అన్నివిధాల వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంది.

Tags

Related News

Baba Vanga Prediction: ఏంటి.. AI వల్ల అలా జరుగుతుందా? భయపెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం!

Noida Man: తల్లి మరణం.. 20 ఏళ్ల యువకుడి ఖాతాలోకి రూ.10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299..

Viral Video: ఇంగ్లండ్ లోనూ ఉమ్మేస్తున్నారు.. ఈ ఖైనీ బ్యాచ్ మారరు!

Biggest Banana: బెట్, ఈ బనానాను ఒక్కరే తినలేరు.. చరిత్రలో అత్యంత పెద్ద అరటి పండు పొడవు ఎంతో తెలుసా?

TCS Employee: ఐటీ ఉద్యోగి రోడ్డుపై నిద్ర.. టీసీఎస్ స్పందన ఇదే

Big Stories

×