BigTV English

Worm In Dairy Milk Chocolate : డైరీ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు.. అసలు మ్యాటర్ బయటపెట్టిన అధికారులు!

Worm In Dairy Milk Chocolate : డైరీ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు.. అసలు మ్యాటర్ బయటపెట్టిన అధికారులు!

hyderabad


Worm In Dairy Milk Chocolate In Hyderabad : చాక్లెట్.. ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు చాక్లెట్‌ను ఇష్టపడతారు. ఎంతలా అంటే.. కొందరి కడుపులో రోజుకో చాక్లెట్ అయినా పడాల్సిందే అంతటా అడిక్ట్ అయ్యారు. మరి కొందకు అయితే టైమ్ పాస్‌ కోసం చాక్లెట్లను తింటుంటారు. చాక్లెట్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నా.. తినడం మాత్రం మానడం లేదు. పిల్లలు స్కూల్‌కి వెళ్లమని మారం చేసినా, గోలపెట్టినా.. తల్లిదండ్రులు ఏడవకు చాక్లెట్ కొనిస్తా అనే స్థాయికి చాక్లెట్‌లు వచ్చాయి.

ఇక చాక్లెట్ ప్రియులకు క్యాడ్‌బరీ డైరీ మిల్క్ తెలియకుండా ఉండదు. డైర్ మిల్క్‌తో తీయని వేడుక చేసుకుందాం అనే కాన్సెప్ట్‌తో ఈ కంపెనీ మార్కెట్‌లోకి వచ్చింది. డైరీ మిల్క్ చాక్లెట్ ప్రతి ఒక్కరు ఒక్కసారైనా తినాలని అనుకుంటారు. ఈ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవర్స్ చాలా ఎట్రాక్ట్ చేస్తాయి. ఈ కంపెనీ ప్రమోషన్స్‌లో భాగంగా చేసే యాడ్స్ కూడా అదే స్థాయిలో చాక్లెట్ ప్రియుల నోరురిస్తాయి.


Read More : డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో బతికున్న పురుగు.. జర భద్రం!

డైరీ మిల్క్ చాక్లెట్‌లకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చాక్లెట్‌లను తమ ఇష్టమైన వారికి గిఫ్ట్‌గా కూడా ఇస్తుంటారు. పల్లెల్లోని చిన్న దుకాణాల నుంచి పట్టణంలోని ఏ షాపులు, సూపర్ మార్కెట్‌లు చూసినా.. ఈ చాక్లెట్లు కనిపిస్తుంటాయి.

అయితే ఫిబ్రవరి 11న డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేసిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. చాక్లెట్ తినేందుకు దానిపై ఉన్న కవర్ తీయగా.. బతికున్న పురుగు చాక్లెట్‌పై తిరుగుతూ కనిపించింది. ఈ ఘటన మన హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మేట్రో స్టేషన్ పరిధిలో జరిగింది.

దీనికి సంబంధించిన వీడియోను రాబిన్ జాచ్యూస్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అప్లోడ్ చేశాడు. ఈ చాక్లెట్‌ను అమీర్‌పేట్ మెట్రో‌స్టేషన్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లోకి కొనుగోలు చేసినట్లుగా తెలిపాడు. దానికి సంబంధించిన బిల్ కూడా జత చేశాడు.

ఎక్స్ వేదికగా ప్రజా ఆరోగ్యానికి భద్రత లేదా అని ప్రశ్నించారు. ఇలా ఎక్స్‌పైరీ అయిన, నాణ్యత లేని వస్తువులను ప్రజలు అమ్ముతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవా అని అన్నారు. గడువు ముగిసిన వస్తులు  విచ్చలవిడిగా అమ్ముతుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయరా అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More : ఏనుగుతో ఫోటో దిగాలనుకో.. రిస్కైన పర్లేదు.. కానీ దాంతో ఆటలాడితే.. ఇలాగే ఉంటది!

దీనిపై స్పందించిన GHMC.. సూపర్ మార్కెట్‌‌‌ను తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫుడ్‌సేఫ్టీ అధికారులను ఆదేశించింది. వెంటనే స్పందించిన క్యాడ్‌బరీ. హాయ్ మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ లిమిటెట్ మేము అత్యధిక నాణ్యతా ప్రమాణాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాము, మీకు ఎదురైన చేదు అనుభవానికి క్షమించండి అని ట్వీట్ చేసింది. ఈ విషయం అంతా మనకు తెలిసిందే.

కానీ తాజాగా అధికారులు ఈ సంఘటకు సంబంధించి వివరాలను వెల్లడించారు. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్‌ సురక్షితం కాదని తేల్చారు. దీని తయారీలో వాడే రోస్టెట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్స్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఈ చాక్లెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×