Viral News: దేనికైనా ఒక హద్దు ఉంటుంది. కొన్ని పనులు నాలుగు గోడల మధ్య చేస్తే అందంగా ఉంటుంది. కాదని దూకుడు ప్రదర్శిస్తే కొంప కొల్లేరు అవుతుంది. ఆ జంట అదే చేసింది. చల్లటి గాలికి తట్టుకోలేకపోయింది. ఏకంగా కారు సన్‌రూఫ్‌పై దగ్గరైంది. ఎవరేమనుకున్నా పట్టించుకోలేదు. లిక్‌లాప్‌లతో రెచ్చిపోయారు. ఆ తర్వాత పోలీసులకు చిక్కారు. అదే వేరే విషయం. ఆ జంటకు సంబంధించి వీడియో నెట్టింట్లో గిరగిరా తిరుగేస్తోంది.
చండీగఢ్ నుంచి హిమాచల్‌ప్రదేశ్ ఓ జంట కారులో వెళ్తోంది. చండీగఢ్-మనాలీ హైవేపై అంటే చెప్పనక్కర్లేదు. కారు రయ్ రయ్ మంటూ వెళ్తుంటాయి. ఆ చల్లటి గాలికి ఆ జంటకు ఏమైందో తెలీదు. ఒక్కసారిగా కారు సన్‌రూఫ్‌పై తేలారు. కాసేపు మాట్లాడుకుంటూనే ఒకరిపై మరొకరు చేతులు వేసుకోవడం మొదలైంది.
చల్లగాలికి వేడి క్రియేట్ చేసే పనిలో పడింది. ఆ యువ జంట ముద్దులు పెట్టుకుని కౌగిలించుకుంటూ దర్శినమిచ్చారు. ఆ సన్నివేశాన్ని వెనుక నుంచి కారులో వెళ్తున్నవారు షూట్ చేశారు. వెనుక నుంచి ఫాలో అవుతున్న కార్లు దగ్గరకు వచ్చేసరికి ఆ జంట ముద్దు నుండి బయటపడి నవ్వడం మొదలైంది.ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
దానికి హిమాచల్‌ప్రదేశ్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. ఆ జంట పోలీసులకు చిక్కింది. కారు చిరునామా హర్యానాలోని గుహ్లా గ్రామం పేరిట ఉంది. అదే పేరుతో రిజిస్టర్ చేయబడింది. కారు సన్‌రూఫ్‌పై అసభ్యకరంగా ప్రవర్తించిన జంటకు 4 వేలు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. వారి మధ్య ప్రేమ ఉండొచ్చుగానీ, మరీ ఇంతలా అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.
ALSO READ: ఆ చెట్టుకు వైద్య పరీక్షలు.. ఎందుకు, ఎక్కడ?
జూన్ 22న కొందరు టూరిస్టులు కదులుతున్న కారులో పార్టీలు చేసుకున్నారు. మద్యం సేవిస్తూ.. కిటికీ, సన్‌రూఫ్ నుండి దూకినట్టు కనిపించిన వీడియో వైరల్ అయ్యింది. వారికి రూ. 2,500 జరిమానా విధించబడింది.
కారు సన్‌రూఫ్ విషయానికి వద్దాం. ఈ మధ్య కొన్ని యువజంటలు ఈ విధంగా రెచ్చిపోతున్నాయి. ఆ మధ్య బెంగుళూరు, హైదరాబాద్‌లో ఇలాంటివి జరిగాయి. ఆపై పోలీసులు భారీగా జరిమానా విధించారు. ఇదే ఒరవడి కంటిన్యూ అయితే యాక్సిడెంట్స్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
एक और धाकड़ जी सनरूफ खोलकर शक्ति प्रदर्शन कर रहे हैं। Video चंडीगढ़–मनाली फोरलेन हाईवे की है। pic.twitter.com/VjqgKYHsjn
— Sachin Gupta (@SachinGuptaUP) June 25, 2025