E-Paper
Advertisement

చచ్చిపోయిన ప్రేమ మళ్లీ తిరిగొస్తే… ఈ లవ్ స్టోరీలో చివరి 20 నిమిషాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది మావా

చచ్చిపోయిన ప్రేమ మళ్లీ తిరిగొస్తే… ఈ లవ్ స్టోరీలో చివరి 20 నిమిషాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది మావా
Advertisement

Chennai Love Story OTT: ఒకసారి మనసు విరిచేసిన వ్యక్తిని మళ్లీ జీవితంలోకి రానివ్వడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా గతాన్ని మర్చిపోయి, కొత్తగా బతకాలని ప్రయత్నిస్తున్న సమయంలో… పాత ప్రేమే ఊహించని విధంగా ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఓ అమ్మాయి జీవితంలో ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఒకవైపు గతంలో తనను గాయపరిచిన ప్రేమ… మరోవైపు తనలో మళ్లీ ప్రేమను పుట్టించిన కొత్త వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది ? ప్రేమలో రెండో అవకాశం మంచిదేనా ? ఇలాంటి ఎమోషన్స్ తో సాగే కథే ‘Chennai Love Story’. మరి ఈ రొమాంటిక్ డ్రామా ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

నివి తన జీవితంలో ఎదురైన ఓ చేదు ప్రేమ అనుభవంతో పూర్తిగా కుంగిపోతుంది. తాను ఎంతో ప్రేమించిన వ్యక్తితో విడిపోయిన తర్వాత ఆ బాధ నుంచి బయటపడటం ఆమెకు చాలా కష్టమవుతుంది. గత జ్ఞాపకాలను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో చెన్నైకి వచ్చి ఫ్రెండ్స్‌తో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టాలని చూస్తుంది. కానీ మనసులో మిగిలిపోయిన గాయం మాత్రం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది.

Advertisement

అలాంటి సమయంలో ఆమెకు స్టీవెన్ శంకర్ పరిచయమవుతాడు. అనాథగా పెరిగిన స్టీవెన్‌కు సినిమాలంటే చాలా ఇష్టం. దర్శకుడు కావాలనే కలతో అవకాశాల కోసం చెన్నైకి వచ్చిన అతని వ్యక్తిత్వం నివికి మొదట అస్సలు నచ్చదు. అతని మాటలు, చేసే పనులు ఆమెకు చిరాకు తెప్పిస్తుంటాయి. కానీ రానురానూ పరిస్థితి మారుతుంది. స్టీవెన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ నివి కూడా తనలో వచ్చిన మార్పును గుర్తిస్తుంది. గతంలో ప్రేమ వల్ల కోల్పోయిన ఆనందాన్ని… అతని పరిచయం మళ్లీ తనకు పరిచయం చేస్తుంది.

చాలా కాలం తర్వాత ఆమె నవ్వడం మొదలుపెడుతుంది. తన జీవితంపై మళ్లీ ఆశలు పెట్టుకుంటుంది. అలా ఇద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. గతాన్ని పూర్తిగా మర్చిపోయి స్టీవెన్‌తో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని నివి భావిస్తుంది. కానీ కథ ఇక్కడితో ముగిసిపోదు. ఆమె గతంలో వదిలేసిన అజయ్ మళ్లీ జీవితంలోకి రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఒకప్పుడు తనను బాధపెట్టిన వ్యక్తిని మళ్లీ ఎదురుగా చూసిన నివి.. పాత జ్ఞాపకాలు, కొత్త ప్రేమ మధ్య చిక్కుకుపోతుంది.

Advertisement

ఇప్పుడు ఆమె ముందున్న ప్రశ్న ఒక్కటే. గతంలో తనను గాయపరిచిన అజయ్‌కు మరో అవకాశం ఇవ్వాలా? లేక తన జీవితంలోకి వచ్చి మళ్లీ నవ్వడం నేర్పిన స్టీవెన్‌తో ముందుకు వెళ్లాలా? స్టీవెన్ ప్రేమ నిజంగా నివి గతాన్ని పూర్తిగా చెరిపేయగలిగిందా? అజయ్ తిరిగి రావడం వెనుక అసలు కారణం ఏంటి? చివరికి నివి ఎవరిని ఎంచుకుంది? ఈ ప్రేమకథ సుఖాంతంగా ముగిసిందా… లేక మరోసారి ఆమె హృదయం ముక్కలైందా? ఈ ప్రశ్నలకు సమాధానం సినిమా క్లైమాక్స్ లోనే తెలుస్తుంది.

తెలుగు సినిమానే

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కథలో కీలకంగా నిలుస్తాయి. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తాజాగా SonyLIV ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రేమకథల్లో ఎమోషన్, బ్రేకప్ తర్వాత వచ్చే సంఘర్షణ, పాత ప్రేమ మళ్లీ ఎదురైతే తీసుకునే నిర్ణయాలు వంటి అంశాలతో నడిచే ఈ సినిమాను మూవీ లవర్స్ ఖచ్చితంగా చూడాల్సిందే.

Read Also: ఓటీటీలోకి తెలుగులో సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్… కిల్లర్ ఎవరో చివరి వరకు కనిపెట్టలేరు

Tags

Related News

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

చనిపోయిన ప్రతిసారీ మళ్లీ బతుకుతాడు… ఏలియన్స్‌తో యుద్ధం గెలిచే వరకు ఆగని టైమ్ లూప్… మైండ్ బ్లాక్ సై-ఫై మూవీ

అమెజాన్ అడవుల్లో సీక్రెట్ సిటీ… వెతుక్కుంటూ వెళ్లి రాత్రికి రాత్రే గల్లంతైన సైంటిస్ట్… క్లైమాక్స్ ఊహించలేరు

ఫ్యూచరిస్టిక్ కాలనీలో ఫేక్ బతుకులు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… స్ట్రీమింగ్ తెలుగులోనే

చెత్త కుప్పలో దొరికే అమ్మాయి… కళ్లు తెరిచాక మెమొరీ లాస్… ఫైటింగ్ మాత్రం పూనకాలే

అమ్మబాబోయ్ అపార్ట్మెంట్ మొత్తం క్రిమినల్సే… ఒక్కో ఫ్లోర్ లో పిచ్చెక్కించే ట్విస్టులు… తోపు సినిమా మావా

ప్రైవేట్ వీడియో లీక్… బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య భయంకరమైన బ్లాక్‌మెయిల్ గేమ్

ప్రతి క్రైమ్ కళ్లముందే రీప్లే… అరుదైన కథ… అదిరిపోయే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

Big Stories

Advertisement
×