BigTV English

AP Govt: రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఈ స్కీమ్ తో వేల రూపాయల ఆదా.. దీపావళి నుండే ప్రారంభం..

AP Govt: రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఈ స్కీమ్ తో వేల రూపాయల ఆదా.. దీపావళి నుండే ప్రారంభం..

AP Govt: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీఎం చంద్రబాబు వీటి అమలు కోసం తీసుకోవలసిన చర్యలను.. వెంటనే ప్రారంభించాలని సామాజిక అధికారులను ఆదేశించారు. కాగా సూపర్ సిక్స్ పథకాలలో ఎక్కువగా మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాలు ఉండడం విశేషం. వాటిలో ఫ్రీ బస్ ఒకటి కాగా.. మరొకటి మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం రెండోదిగా చెప్పవచ్చు. ప్రజలకు తమ ప్రభుత్వం అతి దగ్గరయ్యేందుకు ముందుగా సిలిండర్ల పంపిణీ పథకం అమలు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. నేటి కాలంలో గృహాల గ్యాస్ వినియోగం అధికం కాగా.. ఈ పథకం ముందుగా అమలు చేసి సామాన్య కుటుంబాల మనసు చూరగొనాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం.


ఇప్పటికే వైసీపీ సైతం సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అంటూ విమర్శల జోరు పెంచింది. అబద్దపు హామీలు ఇచ్చారు.. అధికారంలోకి వచ్చారు అంటూ.. మాజీ సీఎం జగన్ సైతం విమర్శించారు. అయితే 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం.. ఇక సూపర్ సిక్స్ హామీల అమలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తగ్గేదె లేదంటున్నారు టిడిపి నేతలు. ఈ దశలోనే అక్టోబర్ 31 దీపావళి పర్వదినం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించి ప్రజలకు దీపావళి కానుక ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం ప్రకటన జారీ చేశారు. అలాగే పౌర సరఫరాల శాఖ సైతం పథకం అమలుకు కావలసిన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు.. అర్హులను ఎలా గుర్తించాలి, గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ఏ విధంగా కొనసాగించాలి అనే అంశాలపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిపై అధికారులు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

Also Read: Poonam Kaur: వంచన చేస్తున్నాడు.. మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ పూనమ్..!


రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులు 1.47 కోట్లమంది ఉండగా.. వీరికి 3 సిలిండర్ల పథకం అమలు చేస్తే రూ. 3640 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేసిన ఎడల… ఒక్కొక్క కుటుంబానికి రూ. 2511 లు ఆదా అవుతుందని చెప్పవచ్చు. ఈ పథకం ప్రారంభమైతే సామాన్య కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుంది. అర్హులను గుర్తించడంలో పారదర్శకత పాటించి.. ప్రతి సామాన్య కుటుంబానికి పథకం వర్తించేలా చర్యలు తీసుకొనేలా అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. అయితే ఇక మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని సైతం అమలు చేసేందుకు అందుకు తగిన మార్గదర్శకాలపై మంత్రివర్గ సమావేశంలో సైతం చర్చించారు. సాధ్యమైనంత త్వరగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి.. ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేలా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Related News

Kurupam Incident: కురుపాం గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

AP Rains: ఏపీలో మళ్లీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు

Srisailam Temple: తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి.. సీఎం చంద్రబాబు సమీక్ష.. డిప్యూటీ సీఎం కీలక సూచన

CM Chandrababu: అనంతపురం, కురుపాం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు

Coconut Price: కొండెక్కిన కొబ్బరి కాయల ధర.. బెంబేలెత్తుతున్న సామాన్యులు

Auto Drivers Sevalo: ఆటో డ్రైవర్ల సేవలో.. జగన్ కోలుకోవడం కష్టం

Chandrababu OG: ఓజీ ఓజీ ఓజీ.. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ బాహుబలి సీన్ రిపీట్, చంద్రబాబు ఏం అన్నారంటే?

AP Social Media: సోషల్ మీడియాపై నియంత్రణ.. కూటమి వ్యూహం, వైసీపీ ప్రతి వ్యూహం

Big Stories

×