E-Paper
Advertisement

చిన్న కార్లు.. పెద్ద రేంజ్.. ఇండియన్ మార్కెట్ లోకి 5 చౌకైన ఈవీలు!

చిన్న కార్లు.. పెద్ద రేంజ్.. ఇండియన్ మార్కెట్ లోకి  5 చౌకైన ఈవీలు!
Advertisement

Upcoming Affordable EVs in India: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా మారుతోంది. ఇప్పటి వరకు ఎక్కువగా ఖరీదైన మోడళ్లకే పరిమితమైన ఈవీలు ఇప్పుడు సామాన్య వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని సరికొత్తగా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, రెనాల్ట్, విన్‌ఫాస్ట్, మారుతీ సుజుకి లాంటి సంస్థలు తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతున్నాయి. 2028 నాటికి భారత మార్కెట్లోకి కనీసం ఐదు కొత్త సరసమైన ఈవీలు వచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ HE1i

హ్యుందాయ్ ప్రస్తుతం HE1i కోడ్‌నేమ్‌తో ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ SUVని అభివృద్ధి చేస్తోంది. ఇది 2026 నవంబర్ లేదంటే డిసెంబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కారును రూపొందిస్తున్నట్లు సమాచారం. స్పై షాట్స్ ప్రకారం బాక్సీ డిజైన్, ఎక్కువ క్యాబిన్ స్పేస్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కనిపిస్తున్నాయి. లోపల రెండు స్క్రీన్లతో కూడిన డాష్‌బోర్డ్ ఉండొచ్చని అంచనా. 9.9 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 12.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. రెండు LFP బ్యాటరీ ఆప్షన్లు రావచ్చని, పెద్ద బ్యాటరీ సుమారు 500 కి.మీ. రేంజ్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. లెవెల్-2 ADAS కూడా ఇందులో ఉంటుంది.

కొత్త టాటా నెక్సాన్ EV

Advertisement

టాటా మోటార్స్ నెక్సాన్‌కు నెక్ట్స్ జెనరేషన్ వెర్షన్‌పై పని చేస్తోంది. 2027 మధ్యలో కొత్త నెక్సాన్ వచ్చిన తర్వాత, దాని ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త మోడల్‌లో డిజైన్‌తో పాటు ఇంటీరియర్, బిల్డ్ క్వాలిటీ, టెక్నాలజీ విషయంలో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ADAS ఫీచర్లను కూడా మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది. బ్యాటరీ గురించి అధికారిక వివరాలు లేనప్పటికీ, LFP టెక్నాలజీ కొనసాగవచ్చని, గరిష్ఠ రేంజ్ 525 కి.మీ. దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.

రెనాల్ట్ బ్రిడ్జర్ EV

రెనాల్ట్ భారత మార్కెట్ కోసం బ్రిడ్జర్ SUVని 2027 సెకెండాఫ్ లో తీసుకురావాలని ఇప్పటికే ప్రకటించింది. దీనికి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా సంస్థ సిద్ధం చేస్తోంది. ఇది 2028 ఫస్ట్ క్వార్టర్ లో వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ, మోటార్, రేంజ్ లాటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ మోడల్ అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ SUVల విభాగంలో పోటీకి వచ్చే అవకాశం ఉంది.

విన్‌ఫాస్ట్ VF X

Advertisement

వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ కూడా భారత మార్కెట్‌పై దృష్టి పెట్టింది. VF X అనే కోడ్‌నేమ్‌తో ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని తయారు చేస్తోంది. ఈ మోడల్ 2028లో వచ్చే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధరను సుమారు రూ.11.5 లక్షలుగా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ వివరాలు ఇంకా బయటకు రాలేదు.

మారుతీ సుజుకి  చిన్న EV

మారుతీ సుజుకి కూడా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. రూ.10 లక్షల లోపు ధర ఉండే మోడల్‌పై కంపెనీ పనిచేస్తోంది. మిగతా కార్ల కంటే చిన్నదిగా, ఏ సెగ్మెంట్‌ లో ఉండే అవకాశం ఉంది. రేంజ్ కూడా టాటా టియాగో EVకు దగ్గరగా ఉండొచ్చని అంచనా. 2028లో ఈ కారు మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.

Read Also: టాటా ఏరిస్ లాంచ్ డేట్ ఫిక్స్.. కొత్త సెడాన్ మార్కెట్ లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే?

Tags

Related News

టాటా ఏరిస్ లాంచ్ డేట్ ఫిక్స్.. కొత్త సెడాన్ మార్కెట్ లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే?

టాటా సియెర్రా డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. లుక్ అదిరింది భయ్యా!

రోనిన్ vs హంటర్ 350.. ధర, పవర్, ఫీచర్లలో ఏ బైక్ ఎలా ఉందంటే?

విన్‌ఫాస్ట్ To హోండా.. ఇండియన్ మార్కెట్ లోకి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీ!

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 3 బిగ్ బైక్స్.. 750 సీసీ పవర్‌తో రచ్చ రచ్చే!

రూ.10 లక్షలు తగ్గిన MG సైబర్‌స్టర్.. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కారు ధర ఎంతంటే?

CNGతో పాటు AMT కూడా.. మారుతి డిజైర్, స్విఫ్ట్ కొత్త వెర్షన్లు విడుదల!

Big Stories

Advertisement
×