BigTV English

Renuka Vs Jagan: ‘సంకర జాతి’ కామెంట్స్.. జగన్‌పై రేణుకాచౌదరి ఆగ్రహం, పార్లమెంటులో చెబుతా

Renuka Vs Jagan: ‘సంకర జాతి’ కామెంట్స్..  జగన్‌పై రేణుకాచౌదరి ఆగ్రహం, పార్లమెంటులో చెబుతా

Renuka Vs Jagan:  ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత అమరావతిపై ఆ పార్టీ వైఖరి మారినట్టు కనిపించింది. హైకమాండ్ దీనిపై నోరు విప్పకపోయినా నేతలు అమరావతి గురించి పదేపదే ప్రస్తావించారు. తాజాగా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని, వైసీపీ నేత సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఇంతాబయటా దుమారం మొదలైంది.


అమరావతి మహిళలను ‘సంకరజాతి’తో పోల్చడంపై కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  తెలుగు ఛానెల్‌తో లైవ్‌లో మాట్లాడిన ఆమె, కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ బతుకేంటో తనకు తెలుసని మనసులోని మాట బయటపెట్టారు. ఆ పేపర్, ఛానెల్ మూసివేయాలని, దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తానని చెప్పకనే చెప్పారు.

జగన్ మానసిక చికిత్స తాను ఉచితంగా చేయిస్తానని అన్నారు. ఈ మాటలు బాధతో అంటున్నానని తెలిపారు. ఇంట్లో తల్లి, రోడ్డులో చెల్లి లేదా? మహిళ.. మీకు జన్మస్థానమని,  బతుకు, ప్రాణం పోసిందని గుర్తు చేశారు. దేశంలో బతుకుతున్నావంటే అందుకు మాతృభూమి కారణమన్నారు. మాతృభూమికి వ్యరేకంగా మాట్లాడినవారిని ద్రోహులు భావిస్తారని చెప్పకనే చెప్పారు.


మహిళలపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడమే కాదు ఖండిస్తారని తెలిపారు ఎంపీ రేణుకా. వైసీపీ ప్రభుత్వం అమరావతి మహిళల పట్ల వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతి విషయంలో జగన్ పట్టిన కక్ష సాధింపు అందరికి గుర్తు ఉందన్నారు.  ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే బయటకు రావాలని డిమాండ్ చేశారు. అమరావతిలో జగన్‌ పర్యటించాలని ఛాలెంజ్ విసిరారు.

ALSO READ: సజ్జల ఇది మరిచిపోయారా? ఆయన చుట్టూ బిగిసిన ఉచ్చు

మహిళలను తక్కువ అంచనా వేశారని, త్వరలో తామేంటే నిరూపిస్తాన్నారు. జగన్ బతుకేంటో తనకు తెలుసని, పార్లమెంటులో చర్చకు తీసుకొస్తానన్నారు. మరీ ఇంతలా దిగజారిపోవడమా? మహిళలు అంటే అంత అలుసా? అంటూ ప్రశ్నించారు. జగన్ వ్యవహారశైలిని తూర్పారబట్టారు.

తండ్రి రాజశేఖర్‌రెడ్డి భౌతికకాయం పక్కన ఉండగా అధికార దాహంతో జగన్ సంతకాలు సేకరించిన విషయాన్ని వివరించారు. జగన్ స్కూల్, కాలేజీ చదువుల గురించి తనకు అంతా తెలుసన్నారు. పనిలో పనిగా సజ్జలపైనా ఆమె విరుచుకుపడ్డారు. ఆయన కిరాయి మనిషులున్నారు. ఆయన గత చరిత్ర గురించి అందరికీ తెలుసన్నారు.

రాజకీయాలకు ఈ స్థాయికి దిగజారిపోవాలా? అంటూ ప్రశ్నించారు.  ఏపీలో ఓటమి అవమానం తట్టుకోలేక గిలగిల కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధానిలో ప్రతీ మహిళ ఉద్యమకారులుగా మారారని గుర్తు చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని ఆగ్రహం వ్యక్తంచేశారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.

 

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×