BigTV English
Advertisement

Nara Lokesh-TDP : మూడు సార్లు.. లోకేశ్ దెబ్బకు ఎవరికి ప్రమోషన్? ఎవరికి గ్యాప్?

Nara Lokesh-TDP : మూడు సార్లు.. లోకేశ్ దెబ్బకు ఎవరికి ప్రమోషన్? ఎవరికి గ్యాప్?

Nara Lokesh-TDP : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన కామెంట్లు చేశారు. TDP అధిష్టానం ముందు కొత్త ప్రతిపాదన పెట్టారు. పార్టీలో వరుసగా మూడుసార్లు ఒకే పదవిలో ఉన్న వాళ్లకి… పదోన్నతి అయినా ఇవ్వాలి.. లేదా, గ్యాప్‌ అయినా ఇవ్వాలని సూచించారు. పార్టీలో కొత్త వాళ్లకూ అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. ఈ మార్పు తనతోనే మొదలు కావాలని అన్నారు. లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో బర్నింగ్ టాపిక్‌గా మారింది. లోకేశ్ మాటలకు అర్థమేంటి? వరుసగా మూడుసార్లు అంటే.. అది పార్టీ పదవులకా? ప్రభుత్వ పదవులకా? ప్రమోషన్లు ఎవరికి? గ్యాప్ ఎవరికి? అంటూ అప్పుడే చర్చ కూడా స్టార్ట్ అయిపోయింది.


టీడీపీలో యంగ్ లీడర్స్ కొరత ఉందా?

వరుసగా మూడుసార్లు. నారా లోకేశ్ చాలా జాగ్రత్తగా వాడారు ఈ పదం. టీడీపీ సీనియర్ల పార్టీ. తెలుగుదేశంలో చాలామంది బడా నేతలు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్లే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందరికంటే సీనియర్ మోస్ట్. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, కళా వెంకట్రావు, పయ్యావుల, పరిటాల.. ఇలా సగానికి పైగా నాయకులు దశాబ్దాల తరబడి పార్టీకి పని చేస్తున్నవారే. మంచిదే. వారి పెద్దరికాన్ని టీడీపీ ప్రతీసారి గౌరవిస్తూనే వస్తోంది. అదే సమయంలో సమపాళ్లలో యంగ్ బ్లడ్ యాడ్ అవుతోందా? నారా లోకేశ్, రామ్మోహన్‌నాయుడు, శ్రీరాం లాంటి యంగ్ టర్క్స్ ఎంతమంది ఉన్నారు పార్టీలో? సీనియర్లు ఫుల్లీ లోడెడ్ అయితే.. పాపులర్ యంగ్ లీడర్ల సంఖ్య మాత్రం వారి ముందు తేలిపోతోంది. ఈ గ్యాప్‌ను లోకేశ్ గుర్తించినట్టున్నారు. అందుకే, టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలో ఈ సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారని అంటున్నారు.


టీడీపీకి తెలుగు సైన్యం కావాలా? 

వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడినే జైల్లో పెట్టారు. బాబు అరెస్ట్ అయితే.. తెలుగు తమ్ముళ్లు రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారేమో అనుకున్నారు చాలామంది. అరెస్టుకు వ్యతిరేకంగా నాయకులు గళమెత్తారు కానీ.. రోడ్లమీదకు వచ్చి స్టేట్‌ను స్తంభింపజేసే స్థాయిలో మాత్రం ఆందోళనలు జరగలేదనే చెప్పాలి. అందుకు కారణం.. భయం. తామెక్కడ రోడ్డెక్కితే పోలీసులు లోపలేస్తారేమోననే భయంతో సీనియర్లు దూకుడుగా వ్యవహరించలేకపోయారనే విమర్శ ఉంది. రాజమండ్రి జైలు ముందుకు వచ్చి నేతలంతా సంఘీభావం తెలిపారు కానీ.. అందులో ఫైర్ మిస్ అయింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వారి నోటికి తాళం వేయడంలో ఆనాడు పార్టీ అంతగా సక్సెస్ కాలేక పోయింది. పవన్ కల్యాణ్ మాదిరి ఊగిపోయే నాయకులు టీడీపీకి అవసరం ఉందని ఆ సమయంలో తెలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Also Read : లోకేశ్ పంచ్‌లు.. పాపం ఏమైపోతారో..

సీనియర్లు కాస్త సెటిల్డ్‌గా ఉంటారని.. అదే యంగ్ బ్లడ్ అయితే ఉత్సాహంతో ఉరకలెత్తుతుందని టీడీపీ భావనగా కనిపిస్తోందని చెబుతున్నారు. అందుకే, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికే నారా లోకేశ్ ఈ సంచలన ప్రతిపాదన తీసుకొచ్చారని అంటున్నారు. వరుసగా మూడుసార్లు పదవిలో ఉన్నవారికి ప్రమోషన్ కానీ, గ్యాప్ కానీ ఇవ్వాలి అంటే.. వారి స్థానంలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడమే తప్ప మరొకటి కాదు. ప్రమోషన్ ఇచ్చి సీనియర్లను గౌరవించడం.. లేదంటే గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్‌ను యంగ్ లీడర్లతో భర్తీ చేయడం ఇదీ లోకేశ్ స్టాటజీ అనే అనాలిసిస్ వినిపిస్తోంది.

పవర్‌ఫుల్ పాలిటిక్స్ దిశగా..

ఇదే అంశాన్ని మరో రకంగా కూడా చూడొచ్చు. టీడీపీ సీనియర్ లీడర్లతో నిండిపోతే.. మిత్రపక్షం జనసేనలో మాత్రం మొత్తం యంగ్ బ్లడ్. స్వయంగా జనసేనానే మరిగే రక్తంతో ఊగిపోతుంటారు. ఆయన్ను చూసి యువతకు పూనకాలు వస్తుంటాయి. పవనే తట్టుకోలేనంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ పార్టీది. జనసేనతో పోలిస్తే.. ఈ యంగ్ జంగ్ విషయంలో టీడీపీలో లోటు ఉంది. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, టెక్నాలజీలో యువతకు టాప్ ప్రయారిటీ ఇవ్వడంలో టీడీపీ ప్రభుత్వం ముందే ఉన్నా.. పార్టీలో యంగ్ యాక్టివిటీ మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. అందుకే.. కీలక సమయంలో నారా లోకేశ్ అత్యంత కీలక ప్రతిపాదన తీసుకొచ్చారని చెబుతున్నారు. అయితే.. మూడుసార్లు పదవుల్లో ఉన్నవారు అంటే చాలామందిని పక్కన పెట్టేయాల్సి రావొచ్చు.. కానీ, నారా లోకేశ్ వరుసగా మూడుసార్లు పదవుల్లో ఉన్నావారి గురించి మాత్రమే మాట్లాడారు. సో.. ఆ లెక్కన చాలా మందే సేఫ్!

Related News

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Big Stories

×