Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలన మారింది. ప్రవీణ్ మృతిపై పోలీసులు కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రవీణ్ ఎలా చనిపోయారనేది ఇప్పటి వరకు కూడా ఓ క్లారిటీ రాలేదు. రాష్ట్రంలో కొందరు యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడని చెబుతుంటే.. మరి కొందరు మాత్ర ప్రవీణ్ ను కిరాతకంగా హత్య చేసి చంపారని ఆరోపిస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇది కచ్చితంగా హత్యనే.. పాస్టర్ల ఆరోపణ
మార్చి 24న మృతి చెందిన ప్రవీణ్ కుమార్ పగడాలది హత్యనా..? లేదా యాక్సిడెంటా..? అన్న కోణంలో పోలీసులు ఇప్పటికే సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కైస్తవ నేతలు, క్రైస్తవ సంఘాలు భారీగా నిరసన, ర్యాలీలు, డిమాండ్ చేస్తున్నారు. ఇది కచ్చితంగా హత్యనే అంటూ.. హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి రాజమండ్రిలో క్రైస్తవ నేతలు, క్రైస్తవ సంఘాలు, ప్రవీన్ కుమార్ పగడాల ఫాల్లోవర్స్, అతని కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
ALSO READ: HCU: హెచ్‌సీయూ వివాదంపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కీలక ఆదేశాలు..
భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం: పాస్టర్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని.. ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యేనని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ మృతిపై వారికి చాలా అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. పోలీసులు నిజాలను బయటపెట్టాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తీవ్ర అనుమానాలు ఉన్నాయని.. ప్రవీణ్ ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. పోలీసులు నిజాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. క్రైస్తవ సంఘాలను కించపరిచే విధంగా మాట్లాడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. తమ భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని పాస్టర్లు చెప్పుకొచ్చారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
అయితే, ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవీణ్ కుమార్ మృతి కేసుకు సంబంధించి నిజాలు బయటపెట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే పోలీసులు విజయవాడ నుంచి పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ ఆగాడు.. ఎక్కడ ఎంత సేపు స్టే చేశాడు..? అనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎన్నిసార్లు ప్రమాదానికి గురయ్యారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ కుమార్ కు సంబంధించి కొన్ని సీసీ ఫుటేజీ వీడియోలు లభ్యం కాగా.. కోసం విజయవాడ దాటిన తర్వాత ప్రధాన ప్లేస్ ల వద్ద మరిన్నీ సీసీ ఫుటేజీ వీడియోలను పోలీసులు చెక్ చేస్తున్నారు.