E-Paper
Advertisement

టాటా To హ్యుందాయ్.. అక్టోబర్‌ లో విడుదలయ్యే సూపర్ మోడల్స్ ఇవే!

టాటా To హ్యుందాయ్.. అక్టోబర్‌ లో విడుదలయ్యే సూపర్ మోడల్స్ ఇవే!
Advertisement

Festive Season Car Launches 2026: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌ లో పండుగ సీజన్ అంటే కొత్త కార్ల సందడే. ముఖ్యంగా దసరా, దీపావళి సమయంలో వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలు కూడా కీలకమైన మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుంటాయి. ఈసారి అక్టోబర్ 2026లో కూడా పలు ఆసక్తికరమైన కార్లు వినియోగదారుల ముందుకు రానున్నాయి. బడ్జెట్ సెడాన్ నుంచి ప్రీమియం SUV, ఆఫ్‌ రోడర్ వరకు విభిన్న విభాగాల్లో కొత్త ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

టాటా ఏరిస్

టాటా మోటార్స్ నుంచి వస్తున్న ఏరిస్‌పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. టిగోర్‌కు ప్రీమియం వారసుడిగా భావిస్తున్న ఈ సెడాన్‌ లో డిజైన్‌తో పాటు ఫీచర్లపైనా కంపెనీ దృష్టి పెట్టింది. అక్టోబర్ 11న, నవరాత్రి ప్రారంభ రోజున కస్టమర్ డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది. కారు మునుపటి మోడల్‌ తో పోలిస్తే కొంత వెడల్పుగా, పొడవుగా ఉండనుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌ మెంట్ స్క్రీన్, డాష్‌ క్యామ్, 360 డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ల ధరలు రూ.5.29 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. AMT, CNG వెర్షన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

స్లావియా ఫేస్‌ లిఫ్ట్‌ లో కీలక మార్పులు

Advertisement

స్కోడా స్లావియా కూడా అక్టోబర్‌ లో కొత్త రూపంతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 6న విడుదల కావచ్చని అంచనాలు ఉన్నాయి. డిజైన్‌ లో మార్పులతో పాటు ఫీచర్లను కూడా అప్‌ డేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఫేస్‌ లిఫ్ట్‌ లో ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతున్నది కొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్. ఇది 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో జతకానుంది. దీని ధర సుమారు రూ.10.50 లక్షల నుంచి రూ.18.50 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

హోండా ఎలివేట్‌కు కొత్త టచ్

మిడ్‌ సైజ్ SUV మార్కెట్లో పోటీని మరింత పెంచేందుకు హోండా ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్‌ ను తీసుకురావచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 6న విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ SUVలో బంపర్లు, ఎక్స్‌ టీరియర్ డిజైన్‌ తో పాటు క్యాబిన్‌ లో కూడా కొన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం. కొత్త ఫీచర్లతో పాటు ప్రస్తుత మోడల్‌ కు భిన్నమైన ప్రీమియం అనుభూతిని అందించేలా అప్‌ డేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.11.91 లక్షల నుంచి రూ.20.50 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

హ్యుందాయ్ బేయాన్.. కొత్త క్రాస్ ఓవర్

Advertisement

హ్యుందాయ్ బేయాన్ కూడా అక్టోబర్‌లో భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్న మోడళ్లలో ఒకటి. అక్టోబర్ 12న గ్లోబల్‌గా పరిచయం కానున్న ఈ క్రాస్ ఓవర్, ఆ తర్వాత భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.  ఈ కాంపాక్ట్ SUV, హ్యుందాయ్ లైనప్‌లో వెన్యూ కంటే దిగువన ఉండే అవకాశం ఉంది. ఆధునిక డిజైన్‌ తో పాటు అందుబాటు ధరలో SUV తరహా వాహనం కోరుకునే వారికి మరో ఆప్షన్‌గా మారొచ్చు. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

దీపావళికి ముందు JSW జెటూర్ T2

అక్టోబర్ చివర్లో JSW జెటూర్ T2 లేదా JSW కాంబాట్‌పై కూడా ఆసక్తి నెలకొంది. దీపావళికి ముందే, అక్టోబర్ 20 నుంచి 28 మధ్య ఈ SUVను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. బాక్సీ డిజైన్, ఆఫ్‌రోడ్ సామర్థ్యంతో కనిపించే ఈ 5 సీటర్ SUVలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఉండొచ్చని తెలుస్తోంది. దీని అంచనా ధర రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం.

Read Also: అక్టోబర్‌ లో కొత్త స్కూటర్ల జాతర.. హోండా, యమహా నుంచి క్రేజీ మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Tags

Related News

రైడర్లకు పండుగే పండుగ.. అక్టోబర్‌ లో 5 కొత్త బైక్‌ల ఎంట్రీ!

అక్టోబర్‌ లో కొత్త స్కూటర్ల జాతర.. హోండా, యమహా నుంచి క్రేజీ మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ To సుజుకి.. అక్టోబర్‌లో దుమ్మురేపే ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీ!

259 కిమీ రేంజ్‌ తో నిస్సాన్ కొత్త EV.. చిన్న కారులో అదిరిపోయే ఫీచర్లు!

పల్సర్‌కు మళ్లీ పాత జోష్ వస్తుందా? కొత్త 125, 150తో బజాజ్ మాస్టర్ ప్లాన్!

కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ వచ్చేస్తోంది.. లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

టాటా To మహీంద్రా.. బ్లైండ్ స్పాట్ ఫీచర్ ఉన్న కార్ల లిస్ట్ ఇదే!

Big Stories

Advertisement
×