E-Paper
Advertisement

సూపర్‌హిట్ స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం నెలకు రూ.25,000 పెన్షన్

సూపర్‌హిట్ స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం నెలకు రూ.25,000 పెన్షన్
Advertisement

Smart Pension Plan| రిటైర్‌మెంట్ తర్వాత నెలవారీ ఆదాయం లేకపోతే ఖర్చులు భరించడం చాలామందికి సవాలుగా మారుతుంది. అందుకే ముందుగానే పెన్షన్ ప్లాన్ చేసుకోవడం ఆర్థిక భద్రతకు ఉపయోగపడుతుంది. ఎల్ఐసి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ (LIC Smart Pension Plan) ఒకేసారి పెట్టుబడి చేసి క్రమం తప్పకుండా పెన్షన్ పొందే అవకాశం ఇస్తుంది. ఇది ఇమ్మిడియట్ ఆన్యూటీ ప్లాన్ (Immediate Annuity Plan) కింద పనిచేస్తుంది.

ఒక్కసారి పెట్టుబడి చేస్తే సరిపోతుంది

ఈ ప్లాన్‌లో ప్రతి నెలా లేదా ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సింగిల్ ప్రీమియం చెల్లించి, ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం ప్రకారం.. నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షికంగా పెన్షన్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ వంటి ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

పెట్టుబడి సమయంలోనే పెన్షన్ నిర్ణయమవుతుంది

Advertisement

ప్లాన్ కొనుగోలు సమయంలో వర్తించే ఆన్యూటీ రేట్ (Annuity Rate) ఆధారంగా పెన్షన్ నిర్ణయమవుతుంది. ఈ ప్లాన్ స్టాక్ మార్కెట్‌తో అనుసంధానమై ఉండదు. అందువల్ల మార్కెట్‌లో రోజువారీ మార్పులు నేరుగా పెన్షన్ మొత్తాన్ని ప్రభావితం చేయవు. అయితే పెన్షన్ మొత్తం పెట్టుబడి, వయస్సు, ఎంచుకున్న ఆప్షన్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

కనీసం రూ.1 లక్షతో పెట్టుబడి ప్రారంభం

ఈ ప్లాన్‌లో కనీస పర్చేజ్ ధర (Purchase Price) రూ.1 లక్షగా ఉంటుంది. అయితే వర్తించే నిబంధనలు, కనీస ఆన్యూటీ అవసరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. గరిష్ట పెట్టుబడిపై లిమిట్ (నిర్దిష్ట పరిమితి లేదని) ఎల్ఐసీ పేర్కొంటోంది. సాధారణంగా ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి చేస్తే ఎక్కువ ఆన్యూటీ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితమైన పెన్షన్ మొత్తం ఎంచుకున్న ప్లాన్ ఆప్షన్‌పై ఆధారపడి ఉంటుంది.

జీవిత భాగస్వామితో కలిసి కూడా తీసుకోవచ్చు

Advertisement

స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌లో సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. జాయింట్ లైఫ్ ఆప్షన్ ద్వారా జీవిత భాగస్వామితో కలిసి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఎంచుకున్న ఆప్షన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత చెల్లింపులు కొనసాగవచ్చు. కొన్ని ఆప్షన్లలో మరణం తర్వాత పర్చేజ్ ప్రైస్ తిరిగి చెల్లించే బెనిఫిట్ కూడా ఉంటుంది. అందుకే పాలసీ తీసుకునే ముందు డెత్ బెనిఫిట్స్ వివరాలను పరిశీలించాలి.

నెలవారీ పెన్షన్‌ రూ.25,000 ఉదాహరణ

ఒక 60 ఏళ్ల వ్యక్తి సుమారు రూ.32 లక్షలు పెట్టుబడి చేశారని అనుకుందాం. అతను తగిన సింగిల్ లైఫ్ ఆన్యూటీ ఆప్షన్‌ను ఎంచుకుంటే పెన్షన్ పొందవచ్చు. ఒక ఉదాహరణలో వార్షిక పెన్షన్ సుమారు రూ.3.01 లక్షలుగా ఉండవచ్చు. దీన్ని 12 నెలలకు విభజిస్తే నెలకు సుమారు రూ.25,088 వస్తుంది. అయితే ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. వాస్తవ పెన్షన్ మొత్తం ప్రస్తుత ఆన్యూటీ రేట్, ఎంచుకున్న ఆప్షన్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read: నెలకు రూ.1 లక్ష సాలరీ.. సాఫ్ట్‌వేర్ జాబ్ కాదని చిన్న బిజినెస్.. నేడు రూ.9 కోట్ల టర్నోవర్

పెట్టుబడికి ముందు ఈ విషయాలు పరిశీలించాలి

లైఫ్ టైమ్ స్థిరమైన ఆదాయానికి ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు అన్ని ప్రయోజనాలు మరియు నిబంధనలను పరిశీలించాలి. ఆన్యూటీ అమౌంట్, డెత్ బెనిఫిట్, లిక్విడిటీ, పేమెంట్ ఫ్రీక్వెన్సీ వంటి అంశాలను తప్పక చూడాలి. ద్రవ్యోల్బణం వల్ల భవిష్యత్తులో స్థిరమైన పెన్షన్ కొనుగోలు శక్తి తగ్గవచ్చు. అందువల్ల పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఎల్ఐసీ అప్డేటెడ్ పాలసీ డాక్యుమెంట్స్ పరిశీలించడం అవసరం.

Also Read: ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

Related News

పెట్టుబడిలో భారీ నష్టం వస్తే తిరిగి కోలుకోవడానికి ఏం చేయాలి? రికవరీ కోసం ఇలా ప్లాన్ చేయండి

ఖాతాదారులకు అలర్ట్..మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్

హౌస్ వైఫ్స్ కోసం..లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియాలు!

క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే ఆ అప్పు ఎవరు కట్టాలి? బ్యాంకులకు ఉండే రూల్స్ ఇవే?

రూ.50 లక్షల పెట్టుబడితో రూ.50 కోట్ల రాబడి.. 21 ఏళ్ల యువతి జాక్‌పాట్

తక్కువ రేట్ అని బట్టలు కొంటున్నారా? ఈ మోసం గురించి తెలిస్తే అస్సలు షాపింగ్ చేయరు!

తల్లి, భార్య, కూతురు కోసం.. అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్‌లు.. జీరో రిస్క్, గ్యారెంటీ లాభం!

Big Stories

Advertisement
×