E-Paper
Advertisement

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Rare Cars of India: భారత్ లో కార్ల హిస్టరీ చాలా క్రేజీగా ఉంటుంది. మారుతి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా లాంటి సంస్థలు మార్కెట్‌ ను మార్చక ముందు కూడా దేశంలో ఎన్నో రకాల వాహనాలు రోడ్ల మీద తిరిగాయి. వాటిలో కొన్ని సాధారణ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తయారైతే.. మరికొన్ని ప్రత్యేక అవసరాల కోసం రూపొందాయి. కొన్ని విదేశీ మోడళ్ల ఆధారంగా తయారయ్యాయి. అయితే కాలం గడిచేకొద్దీ వీటిలో చాలావరకు కనుమరుగయ్యాయి. ఇప్పుడు వాటి పేర్లు కూడా చాలామందికి తెలియవు. ఇంతకీ అవేంటంటే..

హెచ్‌ఎం ట్రెక్కర్

హిందుస్థాన్ మోటార్స్ అంటే వెంటనే గుర్తొచ్చే కారు అంబాసిడర్. అయితే, అదే సంస్థ తయారు చేసిన మరో వెహికల్ హెచ్‌ఎం ట్రెక్కర్. అంబాసిడర్‌లో ఉపయోగించిన కొన్ని భాగాలను ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించారు. లాడర్ ఫ్రేమ్ నిర్మాణంతో తయారైన ఈ యుటిలిటీ వెహికల్ అప్పట్లో కఠినమైన రోడ్లపై ఉపయోగించుకునేలా రూపొందించబడింది. ప్రస్తుతం దీని గురించి తెలిసినవారు చాలా తక్కువ మందే ఉన్నారు.

టాటా ఇండికా

Advertisement

1998లో మార్కెట్లోకి వచ్చిన టాటా ఇండికా భారత కార్ల పరిశ్రమలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. భారతీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దేశంలోనే రూపొందించి, అభివృద్ధి చేసిన ప్యాసింజర్ కారుగా ఇది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్న కుటుంబాలకు అనువైన పరిమాణం, ఉపయోగకరమైన ఇంటీరియర్‌తో అప్పట్లో ఇండికా మంచి ఆదరణ పొందింది. తర్వాత వచ్చిన అనేక దేశీయ కార్లకు ఒక మార్గం చూపిన మోడల్‌గా చెప్పుకోవచ్చు.

నిస్సాన్ జోంగా

నిస్సాన్ జోంగా కథ మిగతా కార్లకు భిన్నంగా ఉంటుంది. ఇది సాధారణ కుటుంబాల కోసం కాకుండా భారత సైన్యం అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుబాటులోకి వచ్చింది. నిస్సాన్ ప్యాట్రోల్ ఆధారంగా రూపొందించిన ఈ వాహనం బలమైన నిర్మాణంతో ఉండేది. తర్వాత పరిమిత సంఖ్యలో ప్రజలు వినియోగానికి కూడా వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, దీని ఉత్పత్తి ఎక్కువ కాలం కొనసాగలేదు. 1999లో ఉత్పత్తి ముగిసే సమయానికి సుమారు 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది.

త్రిశూల్ డీజిల్ టూరర్

Advertisement

పాట్నాలో తయారైన త్రిశూల్ డీజిల్ టూరర్ కూడా భారత ఆటోమొబైల్ చరిత్రలో పెద్దగా పరిచయం లేని వెహికల్ గా గుర్తింపు తెచ్చుకుంది. గత దశాబ్దాల్లో పోలీస్ విభాగం అవసరాల కోసం ఉపయోగించిన ఈ క్రూయిజర్‌లో సింగిల్ సిలిండర్ లోంబార్డిని డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. సాధారణ కార్లకు భిన్నంగా దీని నిర్మాణం, ఇంజిన్ సెటప్ ఉండేవి.

మహీంద్రా వాయేజర్

మహీంద్రా వాయేజర్‌ ను చూస్తే ఇప్పటి MPVల రూపం కొంత గుర్తుకు రావచ్చు. ఇది మిత్సుబిషి డెలికా ఆధారంగా భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. విశాలమైన క్యాబిన్, ప్రత్యేకమైన డిజైన్‌ తో అప్పటి మార్కెట్లో ఇతర కార్లకు భిన్నంగా కనిపించేది. అయితే ఎక్కువ కాలం ఉత్పత్తిలో లేకపోవడంతో భారత రోడ్లపై ఇది చాలా అరుదుగా కనిపించేది.

Read Also: ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Tags

Related News

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

మహీంద్రా విజన్ ఎస్ వచ్చేస్తోంది.. కనెక్టెడ్ టెయిల్‌లైట్లతో అదిరిపోయే లుక్!

టాటా ఏరిస్ విడుదల.. రూ.5.29 లక్షలకే కొత్త సెడాన్!

Big Stories

Advertisement
×