Honda Amaze Price Hike: హోండా అమేజ్ కొనాలని చూస్తున్న వారికి కంపెనీ మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది. హోండా కార్స్ ఇండియా అమేజ్ ధరలను రెండోసారి సవరించింది. ప్రస్తుతం కంపెనీ కొత్త తరం అమేజ్‌తో పాటు గత జెనరేషన్ కు చెందిన మోడల్‌ను కూడా మార్కెట్లో కొనసాగిస్తోంది. తాజా ధరల మార్పు తర్వాత థర్డ్ జెనరేషన్ అమేజ్‌లో కొన్ని వేరియంట్ల ధరలు రూ.15,210 వరకు పెరిగాయి.
హోండా అమేజ్‌ను V, VX, ZX అనే మూడు ప్రధాన ట్రిమ్‌లలో అమ్ముతోంది. వీటిలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. బేస్ వేరియంట్ V (MT) ధర రూ.14,010 పెరిగింది. అదే V (AT) వేరియంట్‌పై రూ.4,710 పెంపు నమోదైంది. ఇక VX (MT) ధర రూ.13,410 పెరగగా, VX (AT) ధర రూ.15,210 పెరిగింది. టాప్ వేరియంట్ ZX (MT) ధర రూ.14,210 పెరిగింది. అయితే ZX (AT) వేరియంట్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. తాజా పెంపు తర్వాత అమేజ్ ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.7.65 లక్షల నుంచి రూ.9.99 లక్షల మధ్య ఉన్నాయి.
అమేజ్‌ను కొనుగోలుదారులను ఆకట్టుకునేలా పలు ఫీచర్లతో అందిస్తున్నారు. ఇందులో ఫుల్ LED లైటింగ్ సెటప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పెద్ద సెంటర్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ప్రయాణ సమయంలో వివిధ పరికరాలను కనెక్ట్ చేసుకునేందుకు USB-A, USB-C పోర్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్లు రోజువారీ వినియోగంలో కారు సౌకర్యాన్ని పెంచేలా ఉంటాయి.
హోండా అమేజ్‌లో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 89bhp పవర్, 110Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, కస్టమర్ల అవసరాన్ని బట్టి 5-స్పీడ్ మాన్యువల్ లేదంటే CVT ఆటోమేటిక్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. నగర ప్రయాణాలకు ఆటోమేటిక్ వెర్షన్ సౌకర్యంగా ఉండగా, మాన్యువల్ వేరియంట్ తక్కువ ధరలో కారు కోరుకునే వారికి ఉపయోగపడుతుంది.
పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ నిర్వహణ ఖర్చు కోరుకునే వారికి అమేజ్‌లో మరో అవకాశం కూడా ఉంది. కంపెనీ అధికారికంగా CNG రెట్రోఫిట్‌మెంట్ సదుపాయాన్ని అందిస్తోంది. అయితే, అమేజ్‌ను కొనుగోలు చేసే ముందు వేరియంట్‌ను బట్టి ధర, గేర్ బాక్స్, ఫీచర్లు, CNG ఎంపిక లాంటి అంశాలను పరిశీలించడం మంచిది. తాజా ధరల పెంపుతో కారు కొనుగోలు బడ్జెట్‌లో కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, ADAS వంటి అధునాతన భద్రతా సాంకేతికతను అందించే సరసమైన కార్లలో అమేజ్‌కు ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.
Read Also: స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?