E-Paper
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బిగ్ అడ్వెంచర్ బైక్.. లాంచ్ కు ముందే హిమాలయన్ 750 లీక్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బిగ్ అడ్వెంచర్ బైక్.. లాంచ్ కు ముందే హిమాలయన్ 750 లీక్!
Advertisement

Royal Enfield Himalayan 750 Launch: అడ్వెంచర్ బైక్‌ల విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో సూపర్ మోడల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటివరకు తయారు చేసిన అతిపెద్ద అడ్వెంచర్ మోటార్‌ సైకిల్‌గా భావిస్తున్న హిమాలయన్ 750 త్వరలో ప్రపంచ మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ బైక్‌ను నవంబర్‌లో జరగనున్న EICMA 2026లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించే అవకాశం ఉంది. భారత మార్కెట్లో మాత్రం దీని లాంచ్ 2026 చివర్లో లేదంటే 2027 ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బైక్‌కు సంబంధించిన పలు టెస్ట్ మ్యూల్స్ రోడ్లపై కనిపించాయి.

హిమాలయన్ 450 కంటే పూర్తిగా భిన్నంగా..

కొత్త హిమాలయన్ 750 ప్రస్తుత హిమాలయన్ 450 ఆధారంగా తయారు చేయడం లేదు. కొత్త ప్లాట్‌ ఫామ్‌పై అభివృద్ధి చేస్తున్నారు. పెద్ద స్టీల్ ట్యూబులర్ ఫ్రేమ్, కొత్త బోల్ట్ ఆన్ రియర్ సబ్‌ఫ్రేమ్‌తో పాటు లాంగ్ టూరింగ్‌కు అనుకూలంగా ఛాసిస్‌ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ బైక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ అడ్వెంచర్ మోడళ్లలో ఫ్లాగ్‌షిప్‌గా నిలిచే అవకాశం ఉంది.

749cc ట్విన్ సిలిండర్ ఇంజిన్

Advertisement

హిమాలయన్ 750లో కొత్త 749cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న 648cc ట్విన్ ఇంజిన్‌ కు అప్ డేట్ వెర్షన్ గా భావిస్తున్నారు. ఎయిర్, ఆయిల్ కూలింగ్‌తో పనిచేసే ఈ ఇంజిన్‌లో 270 డిగ్రీ క్రాంక్, డ్యూయల్ ఓవర్‌ హెడ్ క్యామ్‌ షాఫ్ట్‌లు, ఫ్యూయల్ ఇంజెక్షన్, రైడ్-బై-వైర్ థ్రాటిల్ వంటి టెక్నాలజీలు ఉండవచ్చు.ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని పవర్ సుమారు 50 నుంచి 55bhp మధ్య, టార్క్ 60 నుంచి 65Nm వరకు ఉండొచ్చని అంచనా. హైస్పీడ్ కంటే టూరింగ్ సామర్థ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా బైక్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. గరిష్ట వేగం 170 నుంచి 180 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది.

టూరింగ్‌కు అనుకూలంగా డిజైన్

టెస్ట్ బైక్‌లలో ట్యూబ్‌ లెస్ టైర్లకు అనుకూలమైన క్రాస్ స్పోక్ వీల్స్ కనిపించాయి. కొన్ని ప్రోటో టైపుల్లో అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ముందు 21 అంగుళాలు, వెనుక 17 అంగుళాల చక్రాలు ఉండొచ్చని అంచనా. సుమారు 20 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో లాంగ్ రైడ్‌లకు అనుకూలంగా ఉంటుంది. డిజైన్ పరంగా హిమాలయన్ 450తో పోలిస్తే 750 మరింత పెద్దదిగా ఉంటుంది. పొడవైన విండ్‌ స్క్రీన్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ LED హెడ్‌ ల్యాంప్, హ్యాండ్‌గార్డ్స్, బాష్ ప్లేట్, లగేజ్ ర్యాక్, పానియర్ మౌంట్స్, ఇంజిన్ గార్డ్స్ లాంటి టూరింగ్ ఫీచర్లు ఉండనున్నాయి.

ఫీచర్లు, ధర

Advertisement

కాక్‌పిట్‌లో అప్‌గ్రేడ్ చేసిన TFT డిస్‌ప్లే, గూగుల్ ఆధారిత ట్రిప్పర్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్స్  లాంటి ఫీచర్లు ఉండొచ్చు. రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ కూడా లభించే అవకాశం ఉంది. భారత్ లో హిమాలయన్ 750 ధర సుమారు రూ.4.50 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చని అంచనా. మార్కెట్లోకి వచ్చిన తర్వాత హోండా XL750 ట్రాన్స్‌ ఆల్ప్, సుజుకి వి-స్ట్రోమ్ 800DE, BMW F 900 GS, ట్రయంఫ్ టైగర్ 900, KTM 890 అడ్వెంచర్ లాంటి బైక్‌ లకు  పోటీ ఇవ్వనుంది.

Read Also: హీరో నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్‌లోకి అడుగు పెట్టేదెప్పుడంటే?

Tags

Related News

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×