E-Paper
Advertisement

Suzuki Avenis 125: యూత్ ను ఫిదా చేస్తున్నఅవెనిస్ 125, ఫీచర్లు భలే ఉన్నాయే!

Suzuki Avenis 125: యూత్ ను ఫిదా చేస్తున్నఅవెనిస్ 125, ఫీచర్లు భలే ఉన్నాయే!
Advertisement

Suzuki Avenis 125: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా విడుదలైన సుజుకి అవెనిస్ 125 (Suzuki Avenis 125) యూత్ కు హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. స్పోర్టీ 125cc స్కూటర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇది యువతకు అనుకూలమైన డిజైన్, మంచి పెర్ఫార్మెన్స్, ఫీచర్లతో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది: స్టాండర్డ్, రైడ్ కనెక్ట్ ఎడిషన్, రేస్ ఎడిషన్ లో లభిస్తుంది. ఆగస్ట్ 2025లో డ్యూయల్ టోన్ కలర్ అప్‌డేట్ విడుదలైంది.

వేరియంట్లు, ధరలు

⦿ స్టాండర్డ్ ఎడిషన్: రూ.91,400 నుంచి రూ. 92,000.

Advertisement

⦿రైడ్ కనెక్ట్ ఎడిషన్: రూ. 93,200 నుంచి రూ. 94,000.

⦿ రేస్ ఎడిషన్: రూ.92,300 నుంచి రూ. 96,000.

ఇంజిన్, పెర్ఫార్మెన్స్

Advertisement

Suzuki Avenis 125లో 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, SOHC, 2-వాల్వ్ ఇంజిన్ ఉంటుంది. 8.7 PS @ 6,750 rpm పవర్ ఉత్పత్తి చేస్తుంది. 10 Nm @ 5,500 rpm టార్క్ ఇస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ (E20 కంప్లయంట్ – తక్కువ కార్బన్ ఎమిషన్లు) ఫ్యూయల్ సిస్టమ్ ఉంటుంది. కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్(CVT)  ఉంటుంది. మైలేజ్ 50-55 kmpl వరకు ఇస్తుంది. టాప్ స్పీడ్ సుమారు 90 kmph. ఫ్యూయల్ ట్యాంక్ 5.2 లీటర్లు ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్ డిస్క్, రియర్ బ్రేక్ డ్రమ్ ఉంటుంది. స్పోర్టీ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

Read Also: బీఎండబ్ల్యూ To యమహా.. 2026లో లాంచ్ కాబోయే లగ్జరీ బైక్స్ ఇవే!

Suzuki Avenis  కీ ఫీచర్లు

బాడీ మౌంట్ బ్రైట్ LED హెడ్‌ల్యాంప్, స్పోర్టీ LED టైల్ ల్యాంప్, మోటార్‌సైకిల్ ఇన్‌స్పైర్డ్ రియర్ ఇండికేటర్లు ఉంటాయి. బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ కన్సోల్ ఉంటుంది. రైడ్ కనెక్ట్, రేస్ ఎడిషన్లలో మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది.  సుజుకి రైడ్ కనెక్ట్ యాప్‌తో కనెక్ట్ అవుతుంది. స్పీడ్, ఫ్యూయల్, నావిగేషన్ వంటివి చూపిస్తుంది. అండర్‌ సీట్ స్టోరేజ్ 21.8 లీటర్లు ఉంటుంది.  హెల్మెట్, షాపింగ్ బ్యాగ్స్ ఫిట్ అవుతాయి.

Read Also: ఆకట్టుకుంటున్న టీవీఎస్ ఐక్యూబ్.. ఏకంగా 100కు పైగా ఫీచర్లు!

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే స్పోర్టీ మఫ్లర్ కవర్, స్ప్లిట్ గ్రాబ్ రైల్, స్పోర్టీ మీటర్ విజర్, ఎడ్జీ గ్రాఫిక్స్, లాంగ్,  వైడ్ ఫ్లోర్‌బోర్డ్, ఎక్స్‌టర్నల్ హింజ్ టైప్ ఫ్యూయల్ క్యాప్, డ్యూయల్ లగేజ్ హుక్స్, ఎర్గోనామిక్ రియర్ ఫుట్‌రెస్ట్ ఉంటుంది. కలర్స్.. ఎక్సైటింగ్ న్యూ కలర్స్‌ లో స్పోర్టీ గ్రాఫిక్స్ ను కలిగి ఉంటుంది. సైడ్ స్టాండ్ ఇంటర్‌ లాక్, బ్రైట్ LED హెడ్‌ ల్యాంప్ ఉంటుంది. మెరుగైన విజిబిలిటీ అందిస్తుంది. రియర్ బ్రేక్ లాక్ ఆప్షన్ కూడా ఉంటుంది.

Suzuki Avenis  125 సిటీ కమ్యూటింగ్‌కు అద్భుతంగా సూట్ అవుతుంది.  లో రన్నింగ్ కాస్ట్, సుజుకి సర్వీస్ నెట్‌వర్క్ బాగుంది.

Read Also:  e-యాక్సెస్ TO Hayabusa.. దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న సుజుకి బైక్స్ ఇవే!

Related News

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

Big Stories

Advertisement
×