Nothing Headphone 1 Pro: ప్రముఖ టెక్ బ్రాండ్ నథింగ్ మరో కొత్త ప్రీమియం ఆడియో ప్రొడక్ట్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ‘హెడ్‌ఫోన్ (1) ప్రో’ పేరుతో ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను తీసుకొచ్చింది. ప్రత్యేకమైన డిజైన్‌తో ఇప్పటికే యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నథింగ్.. ఈసారి ప్రీమియం లుక్‌తో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీపై ఫోకస్ చేసింది. టెక్ ప్రియులు, మ్యూజిక్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా రూపొందించిన ఈ హెడ్‌ఫోన్స్‌లో అసలు ప్రత్యేకత ఏంటి? రోజువారీ వినియోగంలో ఇవి ఎంత వరకు ఉపయోగపడతాయి? సౌండ్ క్వాలిటీ, కంఫర్ట్, బ్యాటరీ, ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Nothing Headphone 1 Pro డిజైన్ విషయానికి వస్తే.. కంపెనీ దీనిని మార్క్ గ్లాస్, టైటానియం, అల్యూమినియం కాంబినేషన్‌తో చాలా స్టైలిష్‌గా తీర్చిదిద్దింది. కేవలం 327 గ్రాముల బరువు మాత్రమే ఉండటం వల్ల, తలపై ఎలాంటి భారం అనిపించదు. కుషన్‌లు చాలా మెత్తగా ఉండటం వల్ల గంటల తరబడి పాటలు విన్నా, ఆఫీస్ వర్క్ చేసినా చెవులకు ఏమాత్రం అసౌకర్యం ఉండదు. క్లాసిక్ బ్లాక్, వైట్ రంగుల్లో ఇవి లభిస్తాయి.
Also Read: రూ.3,300కే అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్.. 21 రోజుల బ్యాటరీ, 50+ వర్కౌట్ మోడ్స్!
దీని ఆడియో సిస్టమ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ప్రతి ఇయర్ కప్‌లో ట్రిపుల్ డ్రైవర్ సెటప్‌ను అందించారు. ఇది బేస్, మిడ్స్‌ను అద్భుతంగా అందిస్తుంది. దీనికి తోడు డైనమిక్ స్పేషియల్ ఆడియో విత్ హెడ్ ట్రాకింగ్ వల్ల లైవ్ కాన్సర్ట్‌లో కూర్చుని పాటలు వింటున్న అనుభూతి కలుగుతుంది. ఇందులో ఉన్న 10 మైక్రోఫోన్లు బయటి నాయిస్‌ను 46 డెసిబెల్స్ వరకు తగ్గించి, ప్రశాంతమైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.
ఈ హెడ్‌ఫోన్స్‌లో అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. దీని 1,060 mAh బ్యాటరీ కెపాసిటీ. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి వాడితే ఏకంగా 68 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. అదే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే 30 గంటల వరకు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు. ఇందులో టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో ప్రయాణాల్లో ఉన్నప్పుడు బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ అసలు ఉండదు.
Nothing Headphone 1 Proలో ఉన్న బ్లూటూత్ 6.1 సపోర్ట్ వల్ల ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆటోవేర్ డిటెక్షన్, గేమింగ్ కోసం లో-లేటెన్సీ మోడ్, ఐపీ52 రేటింగ్ వంటి ఫీచర్లు దీని సొంతం. గూగుల్ ఫాస్ట్ పేర్, ఆపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ డివైజ్‌లతో చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది. మంచి ఆడియో, బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
Also Read: గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి? అకౌంట్ డేటాను సురక్షితంగా ఎలా డౌన్‌లోడ్ చేయాలి?