AUS VS BAN: బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా (Bangladesh vs Australia) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (Bangladesh tour of Australia, 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ లో అద్భుతమైన విక్టరీ సాధించింది. ఇక ఇదే ఊపుతో రెండో టెస్టులో ఇవాళ బరిలోకి బంగ్లాదేశ్ దిగింది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుపైన కంగారులు ప్రతీకారం తీర్చుకున్నారు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ జట్టును కేవలం 64 పరుగులకే ఆల్ అవుట్ చేసింది ఆస్ట్రేలియా. మిచెల్ స్టార్క్ దెబ్బకు బంగ్లా బ్యాటర్లు కకావికలమయ్యారు. ఈ క్రమంలోనే 64 పరుగులకు కుప్పకూలింది బంగ్లాదేశ్.
ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవగా.. ఇవాళ రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ పైన ఆస్ట్రేలియా ప్రతీ కారం తీర్చుకుంది. తొలి ఇన్నింగ్స్ లోనే బంగ్లాదేశ్ ను 64 పరుగులకు అలౌట్ చేసింది. గ్రేట్ బారియర్ రీఫ్ ఎరీనా, మ్యాకే (Great Barrier Reef Arena, Mackay) వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో మిచెల్ స్టార్క్ కు ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. అటు పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా జోష్ హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్ నడ్డి విరిచారు. అటు బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఏకంగా నలుగురు డకౌట్ అయ్యారు. 11వ వికెట్ కు బరిలోకి దిగిన షోరిఫుల్ ఇస్లాం ( Shoriful Islam) ఒక్కడే 14 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన ఆటగాళ్లు అంతా పదిలోపే పరుగులు చేయడం గమనార్హం.
ఒరేయ్ మెంటలోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్పగించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమర్శలు
ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో రెండో టెస్టులో దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టుకు వాళ్ళ సొంత గ్రౌండ్ లో చుక్కలు చూపించింది బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలోనే తొలి టెస్ట్ లో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టును దారుణంగా ఓడించింది. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో కూడా నాలుగో స్థానం దక్కించుకుంది. 65 శాతానికి పైగా పాయింట్లను బంగ్లాదేశ్ సంపాదించుకోవడం గమనార్హం.
అయితే తొలి టెస్ట్ గెలిచామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ బంగ్లాదేశ్ లో కనిపించింది. ఈ క్రమంలోనే రెండో మ్యాచ్ లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు, ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పరువు నిలబెట్టుకునేందుకు కసిగాడింది. ఇందులో భాగంగానే మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను కేవలం 64 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో దాటిగా ఆడి బంగ్లాదేశ్ ముందు భారీగా టార్గెట్ పెడితే… ఈ టెస్ట్ కూడా రెండు లేదా మూడు రోజుల్లోనే ఫినిష్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్ పైన కాదు, మీ మగతనం..ఆస్ట్రేలియాను 5-0 తేడాతో వైట్ వాష్ చేసి చూపించండి