Tata Sierra Dark Edition Launched: టాటా మోటార్స్ నుంచి వచ్చిన సియెర్రా ఇప్పటికే SUV మార్కెట్లో ప్రత్యేకమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు, ఈ మోడల్ కు మరింత స్టైలిష్ లుక్ తీసుకొచ్చేలా డార్క్ ఎడిషన్ ను కంపెనీ విడుదల చేసింది. పూర్తిగా బ్లాక్ కలర్ థీమ్ తో రూపొందించిన ఈ కొత్త వెర్షన్ ధర రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సియెర్రా డార్క్ ఎడిషన్‌ను ప్యూర్ L ట్రిమ్ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వేరియంట్ కు సంబంధించిన డార్క్ ప్యాకేజీ కోసం సాధారణ మోడల్ కంటే రూ.20,000 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా హైరేంజ్ ట్రిమ్‌లకు రూ.30,000 వరకు స్పెండ్ చేయాల్సి ఉంటుందిగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌తో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా వేరియంట్‌ను బట్టి లభిస్తాయి.
సియెర్రా డార్క్ ఎడిషన్ లో ప్రధాన ఆకర్షణ దాని కొత్త ఫ్రీసియన్ బ్లాక్ పెయింట్. SUV బయట భాగంలో క్రోమ్ వినియోగాన్ని తగ్గించి, ఎక్కువ భాగం బ్లాక్ ఫినిష్ లోనే ఇచ్చారు. టాటా లోగో, అల్లాయ్ వీల్స్ కూడా డార్క్ ట్రీట్‌మెంట్ పొందాయి. ముందు ఫెండర్లపై ప్రత్యేకమైన DARK బ్యాడ్జింగ్ ఇవ్వడం ద్వారా సాధారణ సియెర్రా కాదని ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది.
బయట నలుపు థీమ్ కొనసాగించినప్పటికీ, ఇంటీరియర్‌లో మాత్రం వైలెట్ కలర్ హైలైట్స్ ను యాడ్ చేశారు. AC వెంట్స్ చుట్టూ, డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సీట్ల వెనుక భాగాల్లో వైలెట్ మెటాలిక్ ట్రిమ్ కనిపిస్తుంది. సీట్ల మీద పర్పుల్ స్టిచింగ్ కూడా ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్లలో ప్రత్యేకమైన మార్పులు చేయలేదు. అందువల్ల వేరియంట్‌ను బట్టి ట్రిపుల్ స్క్రీన్ సెటప్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్ గేట్ లాంటి ఫీచర్లు లభిస్తాయి. అంతేకాకుండా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవెల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, 12 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ లాంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.
డార్క్ ఎడిషన్‌కు ప్రత్యేకంగా కొత్త ఇంజిన్‌ను టాటా తీసుకురాలేదు. స్టాండర్డ్ సియెర్రాలో ఉన్న పవర్‌ట్రెయిన్‌లనే ఇందులో కొనసాగించారు. పెట్రోల్ వెర్షన్‌లో 106hp, 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ DCTతో లభిస్తుంది. డీజిల్ మోడల్‌లో 118hp, 1.5 లీటర్ ఇంజిన్ ఉంటుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక పవర్ ఫుల్ ఆప్షన్‌గా 160hp, 1.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో మాత్రమే లభిస్తుంది.
Read Also: రూ.10 లక్షలు తగ్గిన MG సైబర్‌స్టర్.. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కారు ధర ఎంతంటే?