E-Paper
Advertisement

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి
Advertisement

గ్రామాల్లో ఇంటి బయట పొయ్యిలు ఏర్పాటు చేసుకోవడం సాధారణమే. అయితే, వాటిలో కొన్ని పొయ్యిలు ఓపెన్‌గా ఉంటాయి. మరికొన్ని.. క్లోజ్ చేసి ఉంటాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటివి ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒళ్లు జలదరించే వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో.. పొయ్యి నుంచి పదుల సంఖ్యలో బయటకు రావడం చూస్తే తప్పకుండా వణికిపోతారు.

వీడియోలో ఏం ఉంది?

ఈ ఘటన ఎప్పుడు? ఎక్కడ చోటుచేసుకుందనేది తెలియరాలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఆ వివరాలేవీ తెలియలేదు. ఇక వీడియో విషయానికి వస్తే.. పొయ్యికి రంథ్రం చేయ్యగా.. అందులో నుంచి ఒక పాము పిల్ల బయటకు వచ్చింది. దాన్ని మరింత లోతుగా రంథ్రం చేయగా.. మరికొన్ని పాములు పిల్లలు వచ్చాయి. వాటిని అక్కడ ఉన్న గ్రామస్తులు చాలా ధైర్యంగా చేత్తో పట్టుకుని బకెట్లో వేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత ఓ పెద్ద పామును బయటకు లాగారు. అది కోపం బుసలు కొడుతూ కాటేయడానికి ప్రయత్నించింది. అయినా సరే భయపడుకుండా.. దాన్ని పట్టుకుని ఒక గోనె సంచిలో వేశారు. ఆ తర్వాత మరికొన్ని పాము పిల్లలను బయటకు తీసి బకెట్లో వేశారు. అయితే, పెద్ద పామును వేసిన గోనె సంచెకు రంథ్రం ఉండటంతో అది బయటకు వచ్చింది. దీంతో దాన్ని మరో గోనెసంచిలో వేయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

నిజమేనా? లేదా AI వీడియో?

Advertisement

అయితే.. ఈ వీడియోను చూసిన చాలామంది ఏఐ కావచ్చని కామెంట్లు చేస్తున్నారు. కానీ, అక్కడి వాతావరణం చూస్తుంటే అది నిజంగానే జరిగినట్లు అనిపిస్తోంది. ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి ఆ ఘటన ఎక్కడ చోటుచేసుకుందని చెప్పకపోవడం వల్ల.. అది తప్పకుండా ఏఐ వీడియో కావచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

Advertisement

కొందరైతే.. లైక్‌లు, వ్యూస్ కోసం.. పొయ్యిలో పాములు, దాని పిల్లలను పెట్టి వీడియో తీసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. వారు ఆ పొయ్యిలో పదుల సంఖ్యలో పాములు ఉంటాయని ముందే తెలిసినట్లు.. బకెట్‌ను రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే, ఆ పొయ్యిని తవ్వక ముందే వారు కొన్ని పాములు చూసి ఉంటారని, అందుకే.. పొయ్యికి రంథ్రం చేసి మొత్తం పాములను బయటకు తీసి ఉంటారని మరికొందరు అంటున్నారు. ఈ వీడియోలో ఉన్నవి నాగుపాములని, అవి చాలా ప్రమాదకరమని.. వాటిని అంత నిర్లక్ష్యంగా పట్టుకుంటున్నారంటే.. తప్పకుండా అది స్కిట్ కావచ్చని సందేహిస్తున్నారు. ఈ వీడియో చూస్తే.. మీకు ఏం అనిపిస్తోంది?

Tags

Related News

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊహించని షాక్.. ఇంటికి భారీగా క్యాష్ ఆన్ డెలివరీలు.. దెబ్బకు ఊరు వదిలి జంప్!

‘లద్దాఖ్ మాది.. మీ వాదన చెల్లదు’.. చైనా అభ్యంతరాలను తిప్పికొట్టిన కేంద్రం!

Big Stories

Advertisement
×