E-Paper
Advertisement

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!
Advertisement

Yadea Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. బ్యాటరీ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్‌ తో పాటు స్మార్ట్ ఫీచర్లపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ యాడియా (Yadea) ఆటోపైలట్ ఫీచర్ తో ఆసక్తి కలిగిస్తోంది. అయితే, ఈ ఫీచర్ ఉందంటే బైక్‌ మనిషి అవసరం లేకుండానే రోడ్లపై ప్రయాణిస్తుందని అనుకోవడం సరైనది కాదు. అసలు యాడియా ఆటోపైలట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆటోపైలట్ అంటే నిజంగా సెల్ఫ్ డ్రైవింగా?

సాధారణంగా ఆటోపైలట్ అనే పదం వినగానే డ్రైవర్ అవసరం లేకుండా వాహనం దానంతట అదే ప్రయాణిస్తుందనే ఆలోచన  కలుగుతుంది. కానీ, యాడియా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు దాని అసలు అర్థం ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. యాడియా GFX6 లాంటి కొన్ని మోడళ్లలో పేర్కొన్న క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ నిర్దేశించిన వేగాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఇది బైక్‌ను దానంతట అదే స్టీరింగ్ చేయడం, బ్యాలెన్స్ చేయడం, ట్రాఫిక్‌ను గుర్తించి రూట్ ను ఎంచుకోవడం లాంటి పూర్తి ఆటోమేటిక్ డ్రైవింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండదు.

స్మార్ట్ టెక్నాలజీతో అదనపు సౌకర్యాలు!

Advertisement

యాడియా తన కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల్లో కనెక్టెడ్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తోంది. మోడల్‌ను బట్టి స్మార్ట్‌ ఫోన్ యాప్ ద్వారా అన్‌ లాక్ చేయడం, OTA (Over the Air) సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్స్, నావిగేషన్ సపోర్ట్ లాంటి సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు, కొన్ని మోడళ్లలో ఎనర్జీ రికవరీ సిస్టమ్స్ కూడా ఉంటాయి. బ్రేకింగ్ సమయంలో కొంత పవర్ ను తిరిగి బ్యాటరీకి అందించే ఈ టెక్నాలజీ, వెహికల్ పనితీరు, ఎనర్జీ వినియోగాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. అయితే, అన్ని ఫీచర్లు ప్రతి మోడల్‌లోనూ ఉంటాయని చెప్పలేం.

కాన్సెప్ట్ బైక్ వేరు.. మార్కెట్‌లోని మోడల్ వేరు!

ఎలక్ట్రిక్ వాహనాల ఎక్స్‌ పోలు, టెక్నాలజీ ప్రదర్శనల్లో కంపెనీలు స్వీయ బ్యాలెన్సింగ్, అధునాతన ఆటోమేషన్ సామర్థ్యాలను చూపించే కాన్సెప్ట్ వాహనాలను ప్రదర్శిస్తుంటాయి. కానీ, అలాంటి టెక్నాలజీని ప్రదర్శించడం ఒకటైతే, దాన్ని సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ప్రొడక్షన్ మోడల్‌లో అందించడం మరో విషయం.  స్వయంగా బ్యాలెన్స్ చేసుకుంటూ, స్టీరింగ్ నియంత్రిస్తూ, ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణించే ఎలక్ట్రిక్ బైక్‌కు మరింత అధునాతన సెన్సార్లు, కంట్రోల్ సిస్టమ్‌లు, సేఫ్టీ టెక్నాలజీ అవసరం. అందుకే క్రూయిజ్ కంట్రోల్‌ను పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్‌ గా భావించలేం.

 ఎలక్ట్రిక్ బైక్‌లు ఎలా మారనున్నాయి?

Advertisement

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఆటోమేటిక్ బ్యాలెన్సింగ్, అడ్వాన్స్‌ డ్ రైడర్ అసిస్టెన్స్, మెరుగైన కనెక్టివిటీ లాంటి టెక్నాలజీలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే, వీటి వినియోగంలో రైడర్ భద్రత, ట్రాఫిక్ నిబంధనలు అత్యంత కీలకం కానున్నాయి. యాడియా ఎలక్ట్రిక్ బైక్‌లలోని ఆటోపైలట్ తరహా ఫీచర్లను రియల్ ఆటోమేటిక్ డ్రైవింగ్‌గా భావించకూడదు. ఏ మోడల్‌ లో ఏ ఫీచర్ ఉందో కంపెనీ అధికారిక స్పెసిఫికేషన్లను పరిశీలించిన తర్వాతే ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.

https://www.instagram.com/reels/DeBmlfqMX1T/

Read Also: సింగిల్ ఛార్జ్ తో 250 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!

Tags

Related News

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×