E-Paper
Advertisement

పాలకులు మారినా మారని సరిహద్దు గ్రామాల తలరాత.. అనాథలైన ఆ ఐదు గ్రామాలు

పాలకులు మారినా మారని సరిహద్దు గ్రామాల తలరాత.. అనాథలైన ఆ ఐదు గ్రామాలు
Advertisement

Bhadrachalam: గోదావరి ఉగ్రరూపం దాల్చిందంటే చాలు.. ఆ ఐదు గ్రామాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఊరు చుట్టూ నీరు చేరి ఇళ్లు మునుగుతున్నా, సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పాలనా యంత్రాంగం నుంచి కనీస సాయం అందని దుస్థితి నెలకొంది. భద్రాచలానికి ఆనుకుని ఉన్న యాటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాల ప్రజల బతుకులు నేడు రెండు రాష్ట్రాల సరిహద్దుల నడుమ తీవ్ర అవస్థలకు గురవుతున్నాయి. 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు పేరుతో ఏపీలో కలిపేసిన ఈ ఐదు పంచాయతీలను మళ్లీ తెలంగాణలో కలపాలంటూ గిరిజనులు, స్థానిక ప్రజలు గత 12 ఏళ్లుగా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రం స్పందిస్తేనే గానీ ఈ గ్రామాలకు మోక్షం కలుగదు.

2014 రాష్ట్ర విభజన..

భద్రాచలం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ది చెందిన ప్రాంతం. మరోవైపు గిరిజన సంస్కృతి,సాంప్రదాయాలతో భద్రాచలం దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఏజెన్సీ ప్రాంతం. అయితే భద్రాచలంకు 2014 రాష్ట్ర విభజన,పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శాపంగా మారింది. 2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలను ఏపీలో విలీనం చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చింది. దీంతో అసలు సమస్య మొదలైంది. భద్రాచలం స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాలైన భద్రాచలం రూరల్,చింతూరు, కూనవారం,వీ.ఆర్.పురం ఈ నాలుగు మండలాలు భద్రాచలం నియోజకవర్గం కిందకు వస్తాయి.

భద్రాచలంకు ఎగువన..

Advertisement

మరోవైపు పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు, అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. అయితే భద్రాచలంకు ఎగువున ఉన్న గ్రామాలను సైతం ఏపీలో విలీనం చేయడంతో భద్రాచలం పట్టణవిస్తరణ, దక్షిణ అయోధ్య రాముల వారి ఆలయ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ప్రభావం పడింది. భద్రాచలం నుంచి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకు వెళ్లాలంటే ఏపీలో కలిసిన 5 గ్రామ పంచాయతీలు కన్నాయిగూడెం, గుండాల, యటపాక, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలు భద్రాచలం పట్టణానికి చుట్టూ అంతర్భాగంలో ఉంటాయి.

Also Read: స్పిరిట్ మూవీ నుండి దీపికాను తొలగించడంపై సందీప్ సోదరుడు క్లారిటీ!

గత 12 ఏళ్ళుగా..

Advertisement

ఈ ఐదు గ్రామ పంచాయతీలు పోలవరం ముంపు జాబితాలో ప్రభుత్వం ఇచ్చే ఆర్ అండ్ ఆర్ జాబితాలో లేవు. 2014 నుంచిఇప్పటి వరకు గత 12 ఏళ్ళుగా ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపారు. రాష్ట్రపతి వరకు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు.

ఇబ్బందులతో సతమతం

మరోవైపు భద్రాచలం పట్టణంలో ఉన్న శివారు కాలనీలు ఏపీలోకలవడంతో పరిపాలన పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గోదావరి కరకట్ట స్లూయిజ్ లు రెండు తెలంగాణలో ఉండటం. మరో రెండు ఏపీలో ఉండటంతో ఏపీ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవడంతో గోదావరికి వరదలు వచ్చినప్పుడు స్లూయిజ్ ల ద్వారా వరద నీళ్ళు లీక్ అవుతున్నాయి. దీంతో భద్రాచలం పట్టణం తో పాటు అనేక ప్రాంతాలు ముంపుకు గురి అవుతున్నాయి. భద్రాచలం పట్టణం నుంచి దుమ్ముగూడెం వరకు కరకట్టల నిర్మాణం చేపట్టాలంటే ఏపీలో కలిసిన 9 కిలోమీటర్ల పరిధి ఆటంకంగా మారింది. ఐదు గ్రామ పంచాయతీలు ఏపీలో ఉండటం వలన శాంతి భద్రతల సమస్య తలెత్తుతున్న ఘటనలు ఉన్నాయి.

పట్టించుకోని ప్రభుత్వం..

2022 లో వచ్చిన 71.3 అడుగుల గోదావరికి భద్రాచలం పట్టణంలో చాలా కాలనీలు నీట మునిగాయి. ఈ ఐదు గ్రామ పంచాయతీలు భద్రాచలం పై భాగంలో ఉండటంతో ఏపీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదు. గుండాల గ్రామ పంచాయతీలో వరద ఇళ్ళల్లోకి వస్తే ప్రజలు ఇంటి పైకి ఎక్కి తలదాచుకున్నారు. దీంతో సమాచారంరాగానే భద్రాచలంలోఉన్న ప్రభుత్వ అధికారులు స్పందించి రెస్క్యూ టీమ్ ను గుండాలకు పంపి ఇంటిపైన ఉన్న వారిని రక్షించారు.

Also Read: రూ.1069కే 60H బ్యాటరీ..ఇయర్‌బడ్స్! గేమింగ్, మ్యూజిక్ కోసం బెస్ట్

రాజకీయ పార్టీలకు అస్త్రంగా..

2014 లో ఈ ఐదు గ్రామ పంచాయతీలు ఏపీలో కలిసిన తర్వాత నుంచి ప్రతి ఎన్నికల్లోఅన్ని రాజకీయ పార్టీలకు ప్రధాన అజెండాగామారింది.2014 నుంచి 2023 వరకు తెలంగాణ లో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, కేంద్రంలో 2014 నుంచి బీజేపీ అధికారంలోనే ఉంది. అటు ఏపీలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ,2019 నుంచి 2024 వరకు వైసీపీ, మళ్లీ 2024 నుంచి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు సందర్భం వచ్చిన ప్రతి సారి 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలుపుతామని ప్రకటనలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆచరణలో మాత్రం చొరవచూపడం లేదు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో..

ఐదు గ్రామ పంచాయతీలు ఏపీలో ఉండటంతో ఆ ప్రభావం భద్రాచలం అభివృద్ధిపై పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఐదు గ్రామ పంచాయితీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం పెట్టిడం, ఏపీ ప్రభుత్వంతో సహకారం ఉండటంతో ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేసేలా చొరవ చూపాలని ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నారు.

విలీనం అయితే యాటపాక రైల్వేస్టేషన్?

పాండురంగాపురం నుంచి ఒడిశాలోని మల్కన్ గిరి వరకు వెళ్లే రైల్వే లైన్ భద్రాచలం గుండా వెళ్లాలంటే భద్రాచలంలో స్థలం లేదు. యటపాక గ్రామంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.అయితే యటపాక ప్రస్తుతం ఏపీలో ఉండటంతో భద్రాచలంకు రైల్వే స్టేషన్ అనేది కలగానే మిగిలిపోనుంది. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. దీంతో భద్రాచలంకు లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు.వారికి వసతి,పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.దీంతో వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికి అయినా ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపి ఇక్కడి ప్రజలు గత 12 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నారు.

Also read: జనసేనలో శ్రీనివాస్‌కు కీలక బాధ్యతలు.. కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాడు

Tags

Related News

రోడ్డుపైకి బండి తీస్తున్నారా.. ఇక నుంచి బీకేర్ ఫుల్.. ఈ కొత్త కెమెరాలు చూస్తే చలాన్ పక్కా పడాల్సిందే!

పొమ్మ‌న‌రు.. పొగ‌బెడ‌తారు.. రెబ‌ల్స్‌పై రేవంత్ మార్క్ దండ‌యాత్ర‌.. ప్ర‌తిప‌క్షాల‌కు చిక్క‌కూడ‌ద‌నే వ్యూహం..

ఫామ్‌హౌజ్‌కు పాద‌యాత్ర‌..! కేసీఆర్ సీఎం కావాల‌ని.. పెద్ద‌సారు వ‌ద్ద‌కే అభిమానులు..!

కూటమిలో ఉంటూనే ఫ్రెండ్లీ ఫైట్.. ఏపీలో బీజేపీ మైండ్ గేమ్‌ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఇదే!

రైతుల ధాన్యంతో మిల్లర్ల దందా.. రికవరీ మొదలుపెట్టిన ప్రభుత్వం!

రెండు చరణాలే పాడాలా.. వందేమాతరం చుట్టూ మొదలైన కొత్త రచ్చ!

ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?

Big Stories

Advertisement
×