E-Paper
Advertisement

బిఆర్ఎస్ కొత్త జనతా గ్యారేజ్ వ్యూహం.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్!

బిఆర్ఎస్ కొత్త జనతా గ్యారేజ్ వ్యూహం.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్!
Advertisement

BRS Strategy: సమస్య ఏదైనా సరే.. బాధితుల అడుగు మాత్రం తెలంగాణ భవన్‌ వైపే.. తెలంగాణలో BRS జనతా గ్యారేజ్‌గా మారుతోందా? గతంలో హైడ్రా బాధితులు.. ఆ తర్వాత జీవో-97 రద్దు కోసం విద్యార్థులు.. ఇప్పుడు 22A భూముల బాధితులు, కొడంగల్‌ భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు.. వరుసగా BRSను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్నవారికి తెలంగాణ భవన్‌ ఒక వేదికగా మారుతోందన్న చర్చ మొదలైంది.

BRS కొత్త ఫార్ములా..

ముఖ్యంగా 22A బాధితుల కోసం ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేయడం.. ఫిర్యాదులు స్వీకరించడం, న్యాయపోరాటానికి అండగా నిలవడం చూస్తుంటే సమస్య మీది.. పోరాటం మాది అన్నట్టుగా BRS కొత్త ఫార్ములాను బలంగా ముందుకు తీసుకెళ్తోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాధితులకు అండగా నిలవడం ఒక ఎత్తయితే.. అదే అసంతృప్తిని ప్రభుత్వంపై రాజకీయ అస్త్రంగా మార్చడం మరో ఎత్తుగా కనిపిస్తోంది.

Advertisement

Also Read: కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

అసలు గేమ్‌ ప్లానా?..

హైడ్రా నుంచి 22A వరకు విద్యార్థుల నుంచి కొడంగల్‌ భూ బాధితుల వరకు.. సమస్యలు వేరైనా BRS మాత్రం ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రజా సమస్య ఏదైనా వాటికి పరిష్కారం తెలంగాణ భవన్‌ వద్దే.. అన్న ఇమేజ్‌ తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలతో నష్టపోయామని భావిస్తున్న వర్గాలను తమవైపు తిప్పుకోవడమే అసలు గేమ్‌ ప్లానా? ప్రజా సమస్యలపై పోరాటం పేరుతో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచే ఈ జనతా గ్యారేజ్‌ ఫార్ములా BRSకు ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

Advertisement

Also read: కొడుకుని కాపాడబోయి తండ్రి.. ఇద్దరూ పోయారని భార్య.. ఫ్యామిలీని బలితీసుకున్న స్మార్ట్‌ఫోన్!

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×