E-Paper
Advertisement

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. రాంరెడ్డికి సీటిచ్చింది అందుకేనా..?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. రాంరెడ్డికి సీటిచ్చింది అందుకేనా..?
Advertisement

Graduate MLC: స్వేచ్ఛ బ్యూరో: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి పేరు ను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖరారు చేయడం తో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మెదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పరిచయ వాక్యాలు అవసరం లేని కుటుంబం రాంరెడ్డి బ్రదర్స్ కుటుంబ మని చెప్పవచ్చు. అటువంటి కుటుంబం నుంచి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి ని వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గా బరిలో దింపారు. బిఆర్ఎస్ పాత అభ్యర్థి నే ప్రకటించింది. ఇంకో జాతీయ పార్టీ బిజెపి తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

ఓటరు నమోదు కార్యక్రమం

గత ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడ నుంచి పోటీ చేసి సునాయాసంగా గెలిచారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థి ని ప్రకటించింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి ఎన్నికల ప్రక్రియలో సమాయత్త మయ్యేందుకు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం కీలకంగా మారింది. ఓటర్ల జాబితాలో చేర్పుల కార్యక్రమం మెదలైంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డిదీ రాజకీయ కుటుంబం. ఈయన పెదనాన్న దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రిగా, పాలేరు సుజాతనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గా పనిచేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో..

Advertisement

సుదీర్ఘ కాలంగా నల్లగొండ ఖమ్మం జిల్లా ల్లో చక్రం తిప్పిన, రాజకీయం నడిపిన చరిత్ర రాంరెడ్డి సోదరులకు ఉంది. పైగా ఈ సీటు పరిధిలో 7 మంది మంత్రుల ప్రాతినిధ్యం వహిస్తున్నందున వారి భుజస్కంధాలపై నే గెలుపు భరోసా ఆధారపడి ఉంటుంది . రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 జిల్లాల నుండే సగం సీట్లు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవాలని, మూడు జిల్లాల మంత్రులు ఛాలెంజ్ గా తీసుకోనున్నారు. జన్ – జీ ఆందోళన కార్యక్రమాల పరంపరలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ రాజకీయ ఎత్తుగడను మార్చుకుని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటుంది. ఎన్నిక ఏదైనా అధికార కాంగ్రెస్ పార్టీ యూత్ పాలసీ లో భాగంగా యువతకు సముచితంగా పోటీ చేసే అవకాశం దక్కుతుందని ముందునుండే భావించారు.

Also read: మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం దందా.. మిల్లు యజమానిపై కేసు నమోదు!

కసరత్తులు మెదలు..

Advertisement

కాంగ్రెస్ పార్టీ యూత్ పాలసీలో భాగంగానే ఇక నుంచి నిర్ణయాలు ఉంటాయని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ కి విధేయత, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. కాగా, అధికార కాంగ్రెస్ పార్టీ తో పాటు బిఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించారు. బిజెపి కూడా తమ అభ్యర్థి ని బరిలో దింపేందుకు కసరత్తులు మెదలు పెట్టారు. దీంతో ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పట్టు ను నిలబెట్టేలా కాంగ్రెస్ పార్టీ చర్యలు ఆరంభించిందని కాంగ్రెస్ పార్టీ కి చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు అంటున్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన నల్లగొండ – ఖమ్మం – వరంగల్ నియోజకవర్గం నుండి సునాయాసంగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్‌కు ఉందని కాంగ్రెస్ పార్టీ కు చెందిన గ్రాడ్యుయేట్ లు చెబుతున్న మాట.

కమ్యూనిస్టు పార్టీలు కలిసి వస్తాయా?

ఇదిలా ఉండగా కాంగ్రెస్ తో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి వస్తాయా? అసెంబ్లీ ఎన్నికల్లో ఒడంబడికలో ఉన్న సిపిఐ కాంగ్రెస్ తో కలిసి ఉంటుందా? తేలాల్సి ఉంది. ఉభయ కమ్యూనిస్టుల పాత్రలను డిసైడ్ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు భవిష్యత్తులో రాజకీయ పరమైన పలు కీలకమైన నిర్ణయాలను ఖరారు చేయడానికి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత కీలకం కానున్నాయి. ప్రజాక్షేత్రంలో రానున్న రోజుల్లో ఎన్డీఏ పాత్ర, తెలుగుదేశం, జనసేన పార్టీ ల స్టాండేంటీ? తేలాల్సి ఉంది .

ఖమ్మం డీసీసీ అధ్యక్షుడి హర్షం

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి ఎంపిక పట్ల డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ హర్షం వ్యక్తంచేశారు. విద్యావంతుల ప్రతినిధిగా,కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన కుటుంబం నుంచి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదులోనే గెలుపు పునాది ఉందని, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు,జిల్లా నాయకులు,జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, బ్లాక్ మండల, పట్టణ, కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని కోరారు. సర్వోత్తం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు అందరు ఎన్నికల ప్రచారంలోకి దిగాలని సూచించారు.

Also read: మంగళవారం, శనివారం ఈ ఆహారాలు తినకూడదని ఎందుకు అంటారు? కారణం తెలుసా?

Tags

Related News

బరి గీసి నిలిచిన బీఆర్‌ఎస్‌.. ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌తో పోల్చిన హరీశ్‌.. ! రసవత్తరంగా మారనున్న పోరు.. !

జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం.. 2027 ఏప్రిల్ 1 నుంచి ఆ పనిలో మార్పులు!

టీజీఎస్పీడీసీఎల్ చరిత్రలో ఊహించని రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ వాడకం?

కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

ఎమ్మెల్సీ బరిలో రాంచందర్ రావు.. అధిష్టానం ఆదేశిస్తే సిద్ధమని లీకులు!

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

Big Stories

Advertisement
×