Dalit Christians: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రపతి ఉత్తర్వుల(1950)ను రద్దు చేసి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్పోరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్, ప్రొ. గాలి వినోద్ కుమార్ సంఘీభావం ప్రకటించారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ..
ఈ సందర్బంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దుచేసి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌కు నివేదిక అందజేసినట్లు తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు వివరించారు. ఎస్సీ హోదా లేకపోతే దళిత క్రిస్టియన్లకు విద్యా, ఉద్యోగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా దళిత క్రిస్టియన్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు.
ఎస్సీ హోదా వచ్చే వరకు బీఆర్ఎస్ మద్దతు..
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా వచ్చే వరకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన దళితుల పట్ల వివక్ష మారదని స్పష్టం చేశారు. బీసీ, ఎస్టీలకు మతమార్పిడి స్వేచ్ఛ ఉన్నదన్నారు..వారు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారని తెలిపారు. కేవలం మతం మారిన దళితులకు మాత్రమే రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ మాట్లాడుతూ 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేకపోతే తీవ్ర అన్యాయం..
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా బిల్లు ప్రవేశపెట్టాలని తెలిపారు. 1950 ఆగస్టు 10 ఉత్తర్వులు వెలువడ్డాయని అందుకే ఈ రోజును బ్లాక్ డే పాటిస్తున్నట్లు వివరించారు. మతం మారినంతా మాత్రన కులం మారదని తెలిపారు. ఏ దేవున్ని అయిన విశ్వసించే హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని తెలియజేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేకపోతే తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించారు. రిజర్వేషన్ లేకుంటే దళిత క్రైస్తవులు ఇంకా వెనకబాటుకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రొపెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ..
కమిటీలు నివేదికలు ఇచ్చిన కావాలనే భారత ప్రభుత్వం దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ప్రొపెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. క్రైస్తవ సేవా సమితి అధ్యక్షుడుగడ్డం సాల్మోన్ రాజు, ఆల్ ఇండియా దళిత క్రిస్ట్ రైట్స్ సమితి అధ్యక్షుడు సంగటి మనోహర్, దళిత క్రిస్టియన్ ఫోరం చిన్న జోసెఫ్, రావులపాటి మోసెస్, మానిక్యాల ఎలియా, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డా. ఇస్లాముద్దీన్,క్రిస్టియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Also Read: సిటీ ఓటర్లకు బిగ్ షాక్! సగానికి పడిపోయిన వోటింగ్ కౌంట్.. కారణం ఇదే!