Trump Interview with Elon Musk: డొనాల్డ్ ట్రంప్.. ఆయన ఎవరు? ఏంటి? అనే విషయాలు మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ వాటి జోలికి వెళ్లడం లేదు. కానీ అమెరికా అధ్యక్ష రేస్‌లో ఉన్న ట్రంప్‌ను ఎలాన్‌మస్క్ ఇంటర్వ్యూ చేశారు. రెండు గంటల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో చాలా కీలక అంశాలను చెప్పారు. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాటిపైనే మన డిస్కషన్.
ట్రంప్-మస్క్ ఇంటర్వ్యూ చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తాను అధ్యక్షుడిని అయ్యాక ఎలాంటి పనులు చేపట్టబోతున్నాను అనేది క్లియర్ కట్‌గా చెప్పింది. ఇందులో వలసదారులు, అమెరికాను సూపర్ పవర్‌గా మార్చడం, కమలా హ్యారిస్‌పై ఆయనకున్న అభిప్రాయం, బైడెన్‌ను తప్పించడం వెనకున్న కుట్ర, తనపై జరిగిన హత్యాయత్నం, ప్రత్యర్థి దేశాలపై ఆయనకున్న అభిప్రాయాలు.. ఇవి మెయిన్ సైడ్ హెడ్‌లైన్స్ అని చెప్పాలి. ఒక్కొక్క విషయంపై కాస్త డీప్‌గా వెళితే ట్రంప్ వోకల్ ఫర్ లోకల్ అంటున్నారు.
వలసదారుల విషయంలో మీ ఆలోచన ఏంటి? అనే ప్రశ్నకు చాలా స్ట్రెయిల్‌గా సమాధానం చెప్పారు ట్రంప్. కమలా హ్యారిస్ అధ్యక్షురాలైతే అమెరికా మరింత దిగజారుతుంది. వలసలు మరింత పెరుగుతాయి.. అమెరికన్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. నేను అధికారంలోకి రాగానే వలసదారులపై ఉక్కుపాదం మోపుతా. అలా చేస్తేనే అమెరికాలో నేరాలు తగ్గుతాయి. ఇతర దేశాల నుంచి చాలా మంది నేర ప్రవర్తన ఉన్నవారు అమెరికాలోకి చొరబడుతున్నారు. వారే అనేక నేరాలకు కారణమవుతున్నారు. నేను గెలిస్తే ఇకపై అలాంటిది ఉండదు.. అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్తున్నారు. అమెరికన్ల కలలు నెరవేరాలన్నా.. ఉద్యగాలు సృష్టించాలన్న ఇది జరగాలంటున్నారు. అంటే.. ట్రంప్ గెలిస్తే మరోసారి వలసదారులకు చుక్కలు కనపడటం ఖాయమని అర్థమవుతుంది.
Also Read: నా ఈ మెయిల్స్ హ్యాక్ అయ్యాయి.. ఇదంతా ఇరాన్ వలనే అంటున్న డొనాల్డ్ ట్రంప్
ఇంటర్వ్యూలో మరో హైలేట్ ఏంటంటే.. అమెరికా ప్రత్యర్థి దేశాలను ఆయన పొగడ్తలతో ముంచెత్తుతారు. నిజానికి శత్రు దేశాలను చీల్చి చెండాడితే ప్రజల్లో మంచి పేరు వస్తుందని నేతలు అనుకుంటారు. కానీ ట్రంప్ పూర్తిగా రివర్స్. మస్క్‌తో జరిగిన ఇంటర్వ్యూలో రష్యా, చైనా, ఉత్తర కొరియా అధ్యక్షులను పొగిడారు ట్రంప్. పుతిన్, షీ జిన్‌పింగ్, కిమ్ జోంగ్ ఉన్ వారి సొంత దేశాలను ప్రేమిస్తున్నారు. వారి దేశాలను బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరి గేమ్‌లో వారు టాప్‌లో ఉన్నారు. వారి తప్పేం లేదు.. కానీ వారిని ఎదుర్కోవడానికి నాలాంటి బలమైన అధ్యక్షుడు కావాలన్నారు ట్రంప్. ఈ ఇంటర్వ్యూలో కూడా మరోసారి ఉక్రెయిన్ యుద్ధాన్ని హైలేట్ చేశారు. అసలు తాను ప్రెసిడెంట్‌గా ఉండి ఉంటే.. అసలు రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసేదే కాదన్నారు. గతంలో నేను, పుతిన్ ఉక్రెయిన్ గురించి చర్చించుకున్నామన్నారు. నిజానికి ఉక్రెయిన్‌కు అమెరికా భారీ ఎత్తున ఆర్థిక, ఆయుధ సాయం చేస్తోంది. ఇదంతా అమెరికన్ రీసోర్స్‌లను వేస్ట్ చేయడమే అంటున్నారు ట్రంప్.
నెక్ట్స్ బైడెన్. బైడెన్‌ను తప్పించడం కూడా తన క్రెడిట్ అన్నారు ట్రంప్. తాను డిబెట్‌లో బైడెన్‌ను చిత్తు చిత్తుగా ఓడించడం వల్లే అతడిని తప్పించి.. కమలా హ్యారిస్‌కు పగ్గాలు అప్పగించారన్నారు. నిజానికి బైడెన్‌కు పోటీ నుంచి తప్పుకోవడం ఇష్టం లేదని.. కానీ కుట్రతో తప్పించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. యాక్చువల్‌గా బైడెన్‌కు ఐక్యూ తక్కువనుకున్నానని.. కానీ ఆయన ప్రెసిడెంట్‌కు అసలు ఐక్యూనే లేదని తెలిసిందన్నారు.
ఇక తనపై జరిగిన మర్డర్ అటెంప్ట్‌ను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత దేవుడిపై నమ్మకం పెరిగిందని, తల తిప్పడమే తన ప్రాణాలను కాపాడిందన్నారు. అయితే తన స్పిచ్‌ను కంటిన్యూ చేయాలనుకున్నానని.. కానీ సెక్యూరిటీ వాళ్లు వద్దన్నారన్నారు.
Also Read: ట్రంప్‌కు భారీ షాక్.. అమెరికాలో సీన్ రివర్స్
సో ఓవరాల్‌గా ట్రంప్ ఆలోచలు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. ఆయన కంప్లీట్‌గా అమెరికా డెవలప్‌మెంట్‌పైనే ఫోకస్ చేసేలా కనిపిస్తున్నారు. అంతేకాదు అమెరికా అండ్ అమెరికన్లు ఫస్ట్.. తర్వాతే ఏదైనా అనేలా ఉన్నారు. మరి ఇది ఎంతమంది అమెరికన్లకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ఇక ఈ ఇంటర్వ్యూ ఈ అనూహ్య భేటీతో పాటు.. సైబర్ దాడి జరిగిందంటూ ప్రచారం చేయడం వల్ల కూడా మరింత పాపులర్ అయ్యింది. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ 45 నిమిషాల పాటు ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది. డీడీఓఎస్ అటాక్ కారణమని మస్క్ తెలిపారు. ఫేక్‌గా ఆన్‌లైన్ ట్రాఫిక్‌ను క్రియేట్ చేయడాన్నే డీడీఓఎస్ అంటారు. అయినా కానీ లైవ్‌లో 2 కోట్ల 70 లక్షల మంది విన్నారు. ఇక మరో హైలేట్ ఏంటంటే ట్విటర్‌గా ఉన్నప్పుడు బయటికొచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఎక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
నిజానికి కమలా హారిస్ ఎంట్రీతో ట్రంప్ కాస్త వెనకపడ్డారు. అదే సమయంలో స్ట్రాటజిక్‌గా ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు. మరి ఈ ఇంటర్వ్యూ ట్రంప్‌కు ఎంత మేర ఉపయోగపడుతుందో చూడాలి.