E-Paper
Advertisement

Millionaire Migration: భారత్‌కు హెన్లీ రిపోర్ట్ బిగ్ షాక్.. దేశం దాటుతున్న ఇండియన్ కుబేరులు.. అసలు కారణాలివే..?

Millionaire Migration: భారత్‌కు హెన్లీ రిపోర్ట్ బిగ్ షాక్.. దేశం దాటుతున్న ఇండియన్ కుబేరులు.. అసలు కారణాలివే..?
Advertisement

Millionaire Migration: అంతర్జాతీయంగా మిలియనీర్ల వలసలపై సంచలన నిజాలను హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 పబ్లిష్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అపర కుబేరులు తమ సొంత దేశాలను వదిలి విదేశాలకు తరలిపోతున్న ట్రెండ్ ఇప్పుడు రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులు తమ ఇళ్లను, దేశాలను వదిలిపెట్టి వేరే దేశాలలో స్థిరపడే ట్రెండ్ గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆ వలసలు పాత రికార్డులను బ్రేక్ చేస్తారన్న అంచనాలు పెద్ద సంచలనం. ఈ ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 1.65 లక్షల మంది మిలియనీర్లు తమ దేశాలను వదిలి ఇతర దేశాలకు వెళ్లబోతున్నారని రిపోర్ట్ అంచనా వేసింది. గత ఏడాది ఈ సంఖ్య 1.42 లక్షలుగా ఉంది. 2013లో కేవలం 51 వేల మంది సంపన్నులు మాత్రమే వలస వెళ్లగా, ఇప్పుడు ఆ సంఖ్య మూడు రెట్లు పైగా పెరిగింది.

బ్రిటన్ 5వ స్థానం..

గతంలో మిలియనీర్లు కేవలం పన్ను మినహాయింపులు పొందేందుకే ఇతర దేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు వారి ప్రాధాన్యతలు మారాయి. ఇప్పుడు సంపన్న కుటుంబాలు భద్రత, మెరుగైన లైఫ్ స్టైల్, తమ పెట్టుబడులకు సురక్షిత వాతావరణం కోసం దేశాలు దాటుతున్నారు. ఈ వలసల ట్రెండ్ బిగ్ ప్లేయర్స్ అయిన అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు పెద్ద షాక్ ఇచ్చింది. సంపన్నులు ఎక్కువగా వదిలి వెళ్తున్న ప్రపంచ దేశాల లిస్టులో బ్రిటన్ 5వ స్థానానికి చేరింది. విచిత్రమేమిటంటే బ్రిటన్ నుండి విదేశాలకు వెళ్లడానికి అప్లై చేసుకుంటున్న వారిలో సగం మంది అక్కడి స్థానిక బ్రిటిష్ పౌరులే కావడం కీలకంగా మారింది.

తొలి స్థానంలో..

Advertisement

అమెరికా వెల్త్ మొబిలిటీ స్కోరు 62.3 గా ఉంది. అయితే అక్కడి సంపన్నులు కూడా ప్రత్యామ్నాయ పౌరసత్వం కోసం భారీగా అప్లై చేస్తున్నారు. ఇందులో సగం మంది యూరప్ దేశాలకు, పావు వంతు మంది ల్యాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియనీర్లు, బిలియనీర్లను ఆకర్షించడంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తొలి స్థానంలో నిలిచింది. అత్యధికంగా 85.3 వెల్త్ మొబిలిటీ స్కోరుతో యూఏఈ గ్లోబల్ వెల్త్ హబ్‌గా మారింది. సంపన్నులు యూఏఈని ఒక లాంచ్ ప్యాడ్‌లా వాడుకుంటూ అక్కడి నుండి ఇతర అంతర్జాతీయ అవకాశాలను వెతుక్కుంటున్నారు.

Also read: Jana Sena: తెలంగాణ లీడర్లకు జనసేన గాలం.. అలాంటి నేతలే టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం!

ఇండియాకు 56.5 వెల్త్ మొబిలిటీ స్కోరు..

Advertisement

యూరప్ దేశాల్లో పోర్చుగల్, ఇటలీ, నెదర్లాండ్స్ వైపు ధనవంతులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల స్పెయిన్ గోల్డెన్ వీసాను రద్దు చేయడం, పోర్చుగల్ రూల్స్ ను స్ట్రిక్ట్ చేయడంతో ఇప్పుడు ఆ బెనిఫిట్ గ్రీస్ దేశానికి దక్కుతోంది. మిలియనీర్లు అక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్‌లో ఇండియాకు 56.5 వెల్త్ మొబిలిటీ స్కోరు దక్కింది. మౌలిక వసతులు, అంతర్గత సవాళ్లు ఎదుర్కొంటున్న దేశాల లిస్టులో భారత్ ఉంది. ఇండియన్లు దేశం దాటడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయంటున్నారు. దేశంలోని పెట్టుబడులపై కొద్దిమంది వ్యక్తులకే నియంత్రణ ఉండటం, అలాగే సంక్లిష్టమైన, కఠిన పన్ను నిబంధనలు ఉండడం కారణంగా చెబుతున్నారు.

హెన్లీ రిపోర్ట్..

భారత్ లో కొత్తగా కోటీశ్వరులు అయ్యే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతోంది. అయితే ఆ సంపదను దేశంలోనే ఉంచుకునే వాతావరణం తక్కువగా ఉందన్నది హెన్లీ రిపోర్ట్. ఇవాళ్టి రోజుల్లో భారతీయ సంపన్న కుటుంబాలు విదేశీ పౌరసత్వం పొందడాన్ని కేవలం ఒక హోదాగా మాత్రమే చూడటం లేదు. తమ పిల్లల ఉన్నత చదువులు, వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించడం, భవిష్యత్ తరాలకు సంపదను సులభంగా బదిలీ చేయడం కోసం తమ ఎస్టేట్ ప్లానింగ్‌లో భాగంగానే వారు విదేశాలకు మైగ్రేట్ అవుతున్నారంటున్నారు.

Also read: Food Safety: మీరు తినే పనీర్ బిర్యానీ వెనుక ఇంత ఘోరమా?.. గుండె పగిలే నిజాలు!

Related News

తెలంగాణ సచివాలయంలో షాడో ల దందా కలకలం!

ఓ ర‌కుల్‌.. ఓ త్రిష‌.. రాజ‌కీయ అస్త్రాలుగా సినీ తార‌లు.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేందుకూ వెన‌కాడ‌ని వైనం…!

ఇలా అయితే టార్గేట్ కంప్లీట్ చేయడం కష్టమే.. ప్రభుత్వానికి అధికారులు అల్టిమేటం!

కుక్క‌ను నిలబెట్టినా గెలుస్తాం.. అహంకార‌పు మాట‌ల‌కు, చేష్ట‌ల‌కు కాలం చెల్లు!

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

Big Stories

Advertisement
×