E-Paper
Advertisement

నిరుద్యోగుల నిరసనలకు రాహుల్ గాంధీ మద్దతు.. జార్ఖండ్‌లో దిగివచ్చిన సీఎం సోరేన్!

నిరుద్యోగుల నిరసనలకు రాహుల్ గాంధీ మద్దతు.. జార్ఖండ్‌లో దిగివచ్చిన సీఎం సోరేన్!
Advertisement

Rahul Gandhi: జెన్‌జీతో పెట్టుకుంటే ప్రభుత్వాల‌కు షాక్‌ తప్పదు. జంతర్ మంత‌ర్ ఉద్యమం ఇదే తెలియ‌జేసింది. నీట్ పేప‌ర్ లీకు అంశాన్ని లైట్‌గా తీసుకున్న మోడీ స‌ర్కార్‌.. కాక్రోచుల ఆందోళ‌న‌ను అసలే ప‌ట్టించుకోలేదు. త‌రువాత తేరుకున్నా.. ప‌రిస్థితి చేయిదాటింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. జార్ఖండ్‌లోనూ ఇదే సీన్ రిపీట‌య్యింది. రాహుల్ జోక్యంతో విద్యార్థుల ఉద్యమానికి న్యాయం జ‌రిగింది.

రాహుల్ గాంధీ లేఖతో దిగివచ్చిన హేమంత్

Advertisement

జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీ కాంగ్రెస్‌కు ప్రధాన మిత్రపక్షం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలైన JPSC, JSSC అక్రమాలపై గ‌త కొన్ని రోజులుగా విద్యార్థులు నిర‌స‌న తెలుపుతున్నారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవని, వారిని స్వయంగా కలసి సమస్యను పరిష్కరించాలని సోరేన్‌కు లేఖ రాశారు రాహుల్‌ గాంధీ. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను రాహుల్ గాంధీ ప్రశంసించారు.

విద్యార్థుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి..

Advertisement

విద్యార్థుల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని.. నిరసనకారులతో సీఎం హేమంత్ సోరేన్ స్వయంగా చర్చలు జరపాలని సూచించారు రాహుల్. యువత సంక్షోభంలో ఉన్నప్పుడు.. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాహుల్ గాంధీ లేఖ నేపథ్యంలో, ఆందోళనకారులతో మరోవిడత చర్చలకు సీఎం హేమంత్ సోరేన్ అంగీకరించారు.

పెద్దన్న పాత్ర పోషించిన రాహుల్ గాంధీ..

దీన్ని మ‌రింత లాగ‌డం వల్ల విద్యార్థి ఉద్యమాల‌ను తక్కువ చేసిన‌ట్టు కావ‌డ‌మే కాకుండా.. బీజేపీకి తామంత‌ట తాముగా ఓ అస్త్రాన్ని అందించిన‌ట్టు అవుతుంద‌ని భావించారు రాహుల్‌. అందుకే పంతాల‌కు పోకుండా విద్యార్థుల న్యాయ‌మైన డిమాండ్లను ప‌రిష్కరించాల‌నే విష‌యంలో రాహుల్ పెద్దన్న పాత్ర పోషించారు. రాహుల్ సూచ‌న‌తో ప్రభుత్వం దిగివచ్చింది. 14వ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నియామక పరీక్షల అవకతవకలపై 90 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Also Read: ఏపీ అసెంబ్లీ డే-2.. నేడు సభలో చర్చించే కీలక అంశాలివే!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×