E-Paper
Advertisement

రెండు రాష్ట్రాలు.. ఒకే సీన్.. అసెంబ్లీకి రాని మాజీ సీఎంలు!

రెండు రాష్ట్రాలు.. ఒకే సీన్.. అసెంబ్లీకి రాని మాజీ సీఎంలు!
Advertisement

Jagan- KCR: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీన్ రిపీట్ అవుతూ వస్తోంది. అది చాలా కామ‌న్‌గా మారిపోయింది. మాజీ సీఎంలు ఇద్దరూ అసెంబ్లీకి రావడంలేదు. ఎక్కడైనా ప్రతిప‌క్షనేతలు.. సభలో సమయం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారు. కానీ, రెండు రాష్ట్రాల్లో అధికారపక్షం టైమ్‌ ఇస్తామంటున్నా.. వాళ్లు మాత్రం రావడంలేదు.

ఏపీలో జగన్..

Advertisement

ఏపీ అసెంబ్లీ సెష‌న్స్‌కు జ‌గ‌న్ రాకపోవడం.. ప్రధాన ఇష్యూగా మారింది. క‌చ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందేన‌ని, వైసీపీ ఆరోపిస్తున్న ప్రతీ అంశంపై చ‌ర్చించేందుకు, స‌మాధానం చెప్పేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని ప్రక‌టించారు లోకేశ్. బెంగుళూరులో ఉన్న జ‌గ‌న్ ప్రత్యేక విమానంలో.. వెంట‌నే త‌ర‌లివ‌చ్చి అసెంబ్లీ సెష‌న్స్‌కు రావాలన్నారు.

తెలంగాణలో కేసీఆర్..

Advertisement

తెలంగాణ‌లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే కేసీఆర్ .. అసెంబ్లీకి రాక‌పోవ‌డాన్ని ప్రస్తావిస్తున్నారు. సెప్టెంబ‌ర్‌లో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహించ‌బోతున్నామ‌ని, రండి తేల్చుకుందామంటూ బీఆరెస్‌కు స‌వాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి రావ‌డం లేద‌నే విష‌యాన్ని ప‌దే ప‌దే ప్రస్తావించ‌డం ద్వారా.. ఆయ‌న ఓడినందుకు ప్రజ‌ల పై అల‌క వ‌హించి.. ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం అవుతున్నార‌నే అంశాన్ని ప్రజ‌ల్లో చ‌ర్చకు పెడుతున్నారు.

తెలంగాణ‌లో కేసీఆర్ మౌనం..

సేమ్‌, ఏపీలో కూడా జ‌గ‌న్ ఇదే విధానాన్ని అనుస‌రిస్తున్నారు. కాక‌పోతే, ఆయ‌న పార్టీలైన్‌లో చేసే ఆందోళ‌న‌ల‌కు ముందు వ‌రుస‌లో ఉంటున్నారు. కానీ తెలంగాణ‌లో కేసీఆర్ మౌనంగానే ఉంటున్నారు. జ‌గ‌న్ అసెంబ్లీకి రాక‌పోవ‌డాన్ని టీడీపీ ఓ అస్త్రంగా ప్రయోగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార ప‌క్షాలు.. ప్రధాన ప్రత్యర్థిని ఇరుకునపెడుతున్నాయి.

Also Read: నిరుద్యోగుల నిరసనలకు రాహుల్ గాంధీ మద్దతు.. జార్ఖండ్‌లో దిగివచ్చిన సీఎం సోరేన్!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×