E-Paper
Advertisement

తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. సెప్టెంబర్ 16 లోపు ఇది చేయకపోతే మీ ఓటు పోయినట్లే?

తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. సెప్టెంబర్ 16 లోపు ఇది చేయకపోతే మీ ఓటు పోయినట్లే?
Advertisement

Telangana Voter List: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముగిశాక.. ఎన్నికల సంఘం కొత్తగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. గతంలో.. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 38 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఈ డ్రాఫ్ట్ లిస్టులో.. 2 కోట్ల 64 లక్షల మంది ఓటర్లే ఉన్నారు. SIR ప్రక్రియలో 74 లక్షల మందికి సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని అధికారులు తెలిపారు. వీళ్లందరి పేర్లను తొలగింపు జాబితాలో పెట్టారు. ఇందులో ఎక్కువమంది శాశ్వతంగా వలస వెళ్లిన వారేనని అధికారులు చెప్పారు. దాదాపు 45 లక్షల మంది వేరే చోటుకు మారిపోయారు. మరో 11 లక్షల మంది ఆచూకీ దొరకలేదు.

మరణించిన వారు..

9 లక్షల మంది మరణించిన వారని తేల్చారు. ఇక్కడితో కథ ముగియలేదు. ఇంకో 93 లక్షల మంది ఓటర్లకు నోటీసులు రానున్నాయి. వీరిలో 32 లక్షల మంది తమ రికార్డులను 2002 ఓటర్ జాబితాతో లింక్ చేయలేకపోయారు. మిగతా 61 లక్షల ఓటర్ల వివరాల్లో తేడాలున్నాయని అధికారులు గుర్తించారు. ఈ కేసులన్నింటినీ 890 మంది AEROలు, 119 మంది EROలు విచారించనున్నారు.

Advertisement

Also Read: సెప్టెంబర్‌ 1 నుంచి ఆగిపోనున్న ఉచిత పార్థివ వాహన సేవలు

అక్టోబర్ 19న ఫైనల్..

అర్హత ఉండి.. ఎవరైనా ఓటర్ లిస్టులో పేరు కోల్పోతే.. సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చని సీఈవో చెప్పారు. విచారణ పూర్తి చేసుకుని.. అక్టోబర్ 19న ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేస్తామన్నారు. తప్పులు సరిచేసుకోవడానికి ఫారమ్-6, 7, 8 ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. నోటీసు ఇవ్వకుండా.. ఎవరి ఓటూ డిలీట్ చేయమని, ఈఆర్వో ఆఫీసర్లు రూల్స్ ప్రకారమే ఆర్డర్స్ పాస్ చేస్తారన్నారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం అక్టోబర్ 15తో ముగుస్తుంది. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 19న విడుదల కానుంది.

93 లక్షల మందికి నోటీసులు..

Advertisement

73 లక్షల ఓటర్ల పేర్లు.. లిస్ట్ నుంచి ఎగిరిపోయాయ్. మరో 93 లక్షల మందికి నోటీసులు రానున్నాయ్. ఇప్పుడు.. ప్రతి ఓటరుపై.. సెప్టెంబర్ 16 డెడ్‌లైన్ కత్తిలా వేలాడుతోంది. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో.. మీ పేరు ఉందో.. లేదో.. వెంటనే చెక్ చేసుకోండి.

Also Read: ఏపీలో ఉద్యోగాల రాజకీయం: డీఎస్సీ, గ్రూప్-1 పై అసెంబ్లీ, మండలిలో రచ్చ!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×