E-Paper
Advertisement

టీమిండియాను దెబ్బ‌కొట్టేందుకు న‌ఖ్వీ మ‌రో కుట్ర‌..బాబ‌ర్ కు ఆ కండీష‌న్ పెట్టి మ‌రీ !

టీమిండియాను దెబ్బ‌కొట్టేందుకు న‌ఖ్వీ మ‌రో కుట్ర‌..బాబ‌ర్ కు ఆ కండీష‌న్ పెట్టి మ‌రీ !
Advertisement

Mohsin Naqvi On Babar Azam: వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో బాబర్ ఆజంకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బాబర్ ఆజం, కెప్టెన్ గా అదే సమయంలో బ్యాటర్ గా అదరగొట్టాడు. మొదటి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ.. రెండో మ్యాచ్ లో జట్టును నిలబెట్టాడు బాబర్. ఈ క్రమంలో బాబర్ ఆజం పైన (Babar Azam) విమర్శలు చేసిన వాళ్లే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. మూడేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టును గెలిపించాడని.. బాబర్ ఆజం రియల్ కింగ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

టెస్టులతో పాటు వ‌న్డే, టీ20ల‌కు కెప్టెన్ గా బాబ‌ర్ ఆజం

వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టును గెలిపించిన నేపథ్యంలో బాబర్ ఆజంకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్‌ న‌ఖ్వీ ( Mohsin Naqvi ) బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. టెస్టుల్లో కెప్టెన్ గా ఉన్న బాబర్ ఆజంకు వన్డేలతో పాటు టి20 జ‌ట్టు పగ్గాలు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మూడు ఫార్మాట్స్ కు మళ్లీ బాబర్ ఆజంను కెప్టెన్ చేయాలని మొహ్సిన్‌ న‌ఖ్వీ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఇప్పటికే బోర్డు పెద్దలందరితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో బాబర్ ఆజం కంటే మెరుగైన అవకాశం జట్టులో కనిపించడం లేదు. పాకిస్తాన్ జట్టును వైట్ బాల్ క్రికెట్ లో కూడా ముందుకు తీసుకువెళ్లే కెపాసిటీ కేవలం బాబర్ ఆజంకు మాత్రమే ఉందని బోర్డు పెద్దలు కూడా ఒకే తాటిపైకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు లేదా మూడు రోజుల్లోనే బాబర్ ఆజంను మూడు ఫార్మాట్స్ కెప్టెన్ గా చేస్తూ అధికారిక ప్రకటన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి వస్తుందని అంటున్నారు.

Advertisement

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

టీమిండియాను ఓడించాలని కండిషన్ పెట్టిన మొహ్సిన్‌ న‌ఖ్వీ

మూడు ఫార్మాట్స్ కు బాబర్ ఆజంను కెప్టెన్ చేసేందుకు మొహ్సిన్‌ న‌ఖ్వీ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. అయితే దీనిపై బాబర్ ఆజంకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిక కంటే ముందే ఓ కండిషన్ ఈ సందర్భంగా పెట్టారట మొహ్సిన్‌ న‌ఖ్వీ. త్వరలో టీమిండియాతో ఏ మ్యాచ్ జరిగినా వాళ్లను ఓడించాల్సిందేనని దిశా నిర్దేశం చేశారట. ఏం చేస్తావో చెయ్… ఎవరు కావాలో వాళ్లను తీసుకో.. టీమిండియాను మాత్రం ఓడించి… ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారట. దీనికి బాబర్ ఆజం కూడా సై అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఇండియ‌న్ ఫ్యాన్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు. వెస్టిండీస్ పై గెలిచి, వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన‌ట్లుగా ఫీల్ అవుతున్నార‌ని హేళ‌న చేస్తున్నారు.

Advertisement

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

 

Related News

జపాన్‌‌ను ఓడించేందుకే కింద మీద పడ్డారు..మీరు పాకిస్తాన్ వెంట్రుక కూడా పీకలేరు

ఆ ఇద్దరూ దరిద్రుల వల్ల, నాకు నిద్ర లేకుండా పోయింది…గంభీర్ కామెంట్స్ వైరల్

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

Big Stories

Advertisement
×