EPAPER

Bigg Boss 8 Telugu: గెలిచిన యష్మీ సైన్యం.. నైనికా టీమ్‌కు గండం తప్పదా?

Bigg Boss 8 Telugu: గెలిచిన యష్మీ సైన్యం.. నైనికా టీమ్‌కు గండం తప్పదా?

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో ముందుగా నిఖిల్, నైనికా, యష్మీలు చీఫ్‌లుగా గెలిచారు. అందుకే ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌మేట్స్ అంతా వారు చెప్పినట్టుగా నడుచుకోవాలి. చీఫ్‌లకు మరింత బలం చేకూరడం కోసం కంటెస్టెంట్స్‌ అందరినీ టీమ్స్‌గా విభజించి ఒక్కొక్క చీఫ్‌కు కొందరు కంటెస్టెంట్స్‌ను ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఏ చీఫ్ టీమ్‌కు కంటెస్టెంట్‌గా వెళ్లాలో నిర్ణయించుకునే అవకాశం కంటెస్టెంట్స్‌కే వదిలేశారు. అలా యష్మీ టీమ్‌లో ప్రేరణ, అభయ్, పృథ్విరాజ్, శేఖర్ భాషా చేరారు. నైనికా టీమ్‌లో ఆదిత్య ఓం, సీత, విష్ణుప్రియా, నబీల్ చేరారు. చివరిగా నిఖిల్ టీమ్‌లో నాగ మణికంఠ, సోనియా, బేబక్క చేరారు. ఇక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు.


నిఖిల్‌కు న్యాయం

యష్మీ, నైనికా టీమ్స్‌లో నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. కానీ నిఖిల్ టీమ్‌కు మాత్రం ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రమే దక్కారు. అందుకే బిగ్ బాస్ ఒక నిర్ణయానికి వచ్చారు. యష్మీ, నైనికా టీమ్స్ మధ్య పోటీ పెట్టి ఇరువురి టీమ్స్‌లో ఏ టీమ్ అయితే ఓడిపోతుందో అందులోని ఒక కంటెస్టెంట్‌ను నిఖిల్.. తన టీమ్‌లోకి తీసుకోవచ్చని వివరించారు. ఇక ఇరు టీమ్స్ ఆడే టాస్కులకు నిఖిలే సంచాలకుడిగా వ్యవహరించాలని అన్నారు. దీంతో నిఖిల్‌తో పాటు తన టీమ్ కూడా హ్యాపీ అయ్యింది. అలా తాజాగా ప్రసారమయిన బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్‌లో యష్మీ, నైనికా టీమ్స్ మధ్య మొదటి పోటీ మొదలయ్యింది. గోల్ కొట్టిన వారిదే గెలుపు అంటూ టాస్క్ రూల్స్‌ను బిగ్ బాస్ వివరించారు.


Also Read: ఒకే సెంటిమెంట్ డైలాగ్ చెప్తూ దిగజారిపోతున్న నాగమణికంఠ

గోల్ కొట్టలేదు

‘బాల్ పట్టు గోల్ కొట్టు’ ఆటలో యష్మీ టీమ్ గెలిచింది. యష్మీ టీమ్ కొట్టిన గోల్‌ను గోల్ కీపర్‌గా ఉన్న ఆదిత్య ఓం ఆపలేకపోయాడు. అంతే కాకుండా నైనికా టీమ్ కొట్టిన ప్రతీ గోల్‌ను గోల్ కీపర్‌గా ఉన్న అభయ్ ఆపగలిగాడు. అలా నైనికా, యష్మీ టీమ్స్ మూడుసార్లు పోటీపడాల్సి ఉన్నా.. రెండుసార్లు పోటీ ముగిసేసరికి యష్మీ టీమ్ విన్నర్ అని తేలిపోయింది. దీంతో నైనికా టీమ్ మరింత కసితో ఆడాలని నిర్ణయించుకుంది. దానికోసం ప్లానింగ్ కూడా మొదలుపెట్టింది. ఇక టాస్కుల విషయం పక్కన పెడితే.. బిగ్ బాస్ సీజన్ 8 మొదలయినప్పటి నుండి కిచెన్ విషయంలో కంటెస్టెంట్స్ మధ్య ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. సీజన్ ప్రారంభమయ్యి మూడురోజులు నాలుగు రోజులు ముగుస్తున్నా కూడా ఇంకా ఈ విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

బాత్రూమ్ గొడవలు

తాజాగా బేబక్కతో పాటు ప్రేరణ కూడా కిచెన్ టీమ్‌లో జాయిన్ అయ్యింది. ముందుగా రేషన్ మ్యానేజర్‌గా ఉండను అని చెప్పిన సోనియా తర్వాత తానే స్వయంగా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పింది. ఇక కిచెన్ విషయంలో కాకుండా బాత్రూమ్ విషయంలో కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. బాత్రూమ్‌లో ఎవరో ఒకరు రబ్బర్ బ్యాండ్ వదిలేశారని సీరియస్ అయ్యింది యష్మీ. ఈ విషయంపై అభయ్, సోనియా విమర్శించారు. నాగ మణికంఠ కూడా బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచడం లేదంటూ తనపై కూడా యష్మీ సీరియస్ అయ్యింది. దీంతో కిచెన్, బాత్రూమ్ గొడవలతోనే కంటెస్టెంట్స్ చాలా బిజీగా గడిపేస్తున్నారని ప్రేక్షకులు సెటైర్ వేస్తున్నారు.

Related News

Bigg Boss Buzz: అతడు సేఫ్ గేమ్ ఆడాలనుకున్నాడు, తల్లి చావుతో లాభం పొందాలనుకున్నాడు.. శేఖర్ భాషా షాకింగ్ కామెంట్స్

Bigg Boss 8 Telugu: YS అంటే అర్థం అదేనా? సోనియా గుట్టు బయటపెట్టేసిన నాగ్.. బ్రేకప్ స్టోరీ చెప్పిన సీత

Bigg Boss 8 Telugu: శేఖర్ భాషా అవుట్.. కలిసికట్టుగా గెంటేసిన హౌజ్‌మేట్స్, వెళ్లేముందు వారికి ఫేక్ సర్టిఫికెట్

Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ 8లోనే అతిపెద్ద ట్విస్ట్.. ఆ బాధ్యతను వారికే అప్పగించిన నాగార్జున

Bigg Boss 8 Telugu Promo: అభయ్‌కు సోనియా వెన్నుపోటు, నిఖిలే కావాలంటూ రూట్ ఛేంజ్.. తనకు బ్రెయిన్ లేదని ఒప్పుకున్న విష్ణుప్రియా

Bigg Boss 8 Telugu: హౌజ్ నుండి అతడు ఎలిమినేట్.. ఫ్రెండ్స్ వెన్నుపోటుతో ఎలిమినేషన్స్‌లో ట్విస్ట్

Bigg Boss 8 Telugu: చీఫ్స్ స్థానాలను కాపాడుకోలేకపోయిన యష్మీ, నైనికా.. నిఖిల్‌తో పాటు అతడే కొత్త చీఫ్

Big Stories

×