BigTV English

Big TV Exclusive: తారుమారయిన ఓటింగ్.. బిగ్ బాస్ హౌస్ నుండి కిర్రాక్ సీత ఎలిమినేట్

Big TV Exclusive: తారుమారయిన ఓటింగ్.. బిగ్ బాస్ హౌస్ నుండి కిర్రాక్ సీత ఎలిమినేట్

Bigg Boss 8 Elimination: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి నెలరోజులు పూర్తయ్యింది. ప్రస్తుతం కంటెస్టెంట్స్ అంతా ఆరో వారంలో అడుగుపెట్టారు. ఇప్పటివరకు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ వల్ల ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్మెంట్ దక్కడం లేదని ఫీల్ అయిన మేకర్స్.. దానికోసమే ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ను తీసుకొచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కొందరి ఆటతీరు మారింది. అలాగే కిర్రాక్ సీత ఆటతీరు కూడా మారింది. తను బాగా ఆడుతుంది అనుకొని తనకు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు పెద్ద షాకే తగిలింది. బిగ్ బాస్ హౌస్ నుండి సీత ఎలిమినేట్ అయిపోయి వెళ్లిపోయింది. చివరి నిమిషంలో ఓటింగ్ తారుమారవ్వడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది.


అంతా పాజిటివ్

బిగ్ బాస్ 8 ప్రారంభమయినప్పటి నుండి సీతను చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు ప్రేక్షకులు. ఆట విషయంలో, హౌస్‌లో అందరితో కలిసిపోయే విషయంలో సీత దగ్గర నుండి చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయని చాలామంది పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. ఎక్కువగా అందరితో గొడవపడడం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం లాంటివి సీత చేసేది కాదు. ఎవ్వరితో అయినా బాగానే కలిసిపోయేది. అలాంటి సీత ఎలిమినేట్ అవుతుంది అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు. ఆరో వారం ప్రారంభం అయినప్పటి నుండి విష్ణుప్రియానే ఓటింగ్ విషయంలో లాస్ట్‌లో ఉందని, ఈవారం కచ్చితంగా తనే ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీత బయటికి వెళ్లిపోయింది.


Also Read: బిగ్ బాస్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

సీత సుత్తి

ఈవారం బిగ్ బాస్ హౌస్‌లోకి రాయల్స్ అంటూ కొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అయ్యారు. ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్‌లో అందరూ ముందుగా బిగ్ బాస్ ప్రేక్షకులకు తెలిసినవారే. బిగ్ బాస్ మునుపటి సీజన్స్‌లో కంటెస్టెంట్స్‌గా కనిపించిన వారినే ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ప్రవేశపెట్టారు మేకర్స్. అయితే వారంతా ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన ఆటను, కంటెస్టెంట్స్ ప్రవర్తనను బయటి నుండి బాగా గమనించి వచ్చారు. వారు చూసిన దానిబట్టి చాలామంది సీతపై నెగిటివ్ అభిప్రాయంతోనే హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఎప్పుడు చూసినా సీత ఏడుస్తూనే ఉంటుందని, తను హౌస్‌లో సుత్తిలాగా అనిపిస్తుందని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.

అవే కారణాలు

బయట నుండే సీతపై నెగిటివ్ అభిప్రాయంతో ఎంటర్ అయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. హౌస్‌లోకి ఎంటర్ అవ్వగానే సీతను టార్గెట్ చేశారు. చాలామంది నామినేషన్స్‌లో తననే నామినేట్ చేశారు. తను అందరితో ఈజీగా కలవడం లేదని ఒకరు, అందరినీ నవ్వుతూ పలకరించడం లేదని మరికొందరు.. ఇలా ఎవరికి నచ్చిన కారణాలు వారు చెప్పి సీతను నామినేషన్స్‌లో పెట్టారు. అలా నామినేషన్స్‌లోకి వచ్చిన సీతకు సపోర్ట్ చేసేవారు తక్కువ అయ్యారు. అందుకే ఓటింగ్ విషయంలో విష్ణుప్రియా, సీత డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఫైనల్‌గా విష్ణుప్రియా సేవ్ అయ్యి సీత ఎలిమినేట్ అయ్యింది. సీత ఎలిమినేట్ అయిన విషయం తెలిసి తన ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు.

Related News

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×