Deadbody in Train Toilet| రైలు ప్రయాణం చేస్తున్న ఓ యువకుడు టాయిలెట్ కోసమని వెళితే అనుకోకుండా అక్కడ ఒక మృతదేహం కనిపించింది. టాయిలెట్ లోపం మరో యువకుడి శవం వేలాడుతుండడం చూసి ఆ ప్రయాణికుడు భయపడిపోయి రైల్వే పోలీసులు సమాచారం అందించాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ట్రైన్ నెంబర్ 19413.. అహ్మదాబాద్ – కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో గురువారం ఒక ప్రయాణికుడు అనుమాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ట్రైన్ మధ్య ప్రదేశ్ లోని సాగర్ రైల్వే స్టేషన్ లో నిలబడి ఉన్నప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాగర్ స్టేషన్ లో ట్రైన్ మధ్యాహ్నం 2:10 గంటలకు వచ్చింది. స్టేషన్ పై ట్రైన్ రాకముందే మరో యువకుడు టాయిలెట్ కోసం వెళ్లగా అతనికి లోపల మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో ఆ బోగీలో ప్రయాణికులుంతా ఆందోళన చెందారు. ఆ తరువాత సమచారం అందుకున్న రైల్వే పోలీసుల సాగర్ స్టేషన్ రాగానే ఆ కంపార్ట్‌మెంట్ కు వచ్చి మృతదేహాన్ని బయటికి తీశరు.
ఈ ఘటనపై ఆర్‌పిఎఫ్ (రైల్వే పోలీసులు) అధికారి మాట్లాడుతూ.. “ఆ టాయిలెట్ సీల్ చేశాం. చనిపోయిన వ్యక్తి వయసు 30 నుంచి 35 ఏళ్ల ఉంటుంది. అది ఒక జనరల్ కోచ్ కావడంత రద్దీగా ఉంది. కంపార్ట్ మెంట్ వెనుక భాగంలో ఉన్న టాయిలెట్ లో శవం లభించింది. అయితే ఆ శవం ఎవరిదో ఇంతవరకూ స్పష్టం కాలేదు. మృతదేహం బట్టల్లో ఎలాంటి గుర్తింపు పత్రాలు లేదా రైల్వే టికెట్ లభించలేదు. బీనా జంక్షన్ నుంచి ట్రైన్ బయలుదేరిన తరువాత ఒక ప్రయాణికులు టాయిలెట్ లోపల శవం ఉన్నట్లు గుర్తించి టిటి ఆఫీసర్ కు సమాచారం అందించాడు. ఆ తరువాత ట్రైన్ ప్రయాణంలో ఉండడంతో ఘటన గురించి సాగర్ స్టేషన మేనేజర్ కు, తద్వారా పోలీసులకు తెలియజేశారు. అయితే ట్రైన్ ని ఆపేందుకు చైన్ లాగాల్సి వచ్చింది. సాగర్ స్టేషన్ లో ఫారెన్సిక్ నిపుణల టీమ్ వచ్చి టాయిలెట్ పరిసరాల్లో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని సమీప ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించాం. సాగర్, బీనా పోలీస్ స్టేషన్లు చనిపోయిన వ్యక్తి గుర్తింపు కోసం సమాచారం అందించాం.” అని తెలిపారు. పోలీసులు మరోవైపు ఇది పూర్తి ఆత్మహత్య అని నిర్ధారించలేదు. ఆ వ్యక్తిని ఎవరైనా హత్య చేసి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని అన్నారు.
Also Read: పెళ్లిలో వధూవరుల బంధువుల మధ్య గొడవ.. తందూరి రోటీ కోసం ఇద్దరు హత్య
ట్రైన్ లో శవం లభించడం కారణంగా విచారణ కోసం ప్రయాణం మధ్యలో ఆపాల్సి వచ్చింది. దీని కారణంగా ట్రైన్ గంట పాటు ఆలస్యంగా నడిచింది.
గతంలో కూడా ఇలాగే ఒక ట్రైన్ టాయిలెట్ లో శవం లభించింది. 2022లో జరిగిన ఈ ఘటన బిహార్ సహస్ర నుంచి పంజాబ్ అమృత్ సర్ కు బయలుదేరే జన్ సేవా ఎక్స్‌ప్రెస్ లో జరిగింది. అయితే బిహార్ లోనే ఆ వ్యక్తి ట్రైన్ బయలుదేరకముందే టాయిలెట్ వెళ్లి లోపలే చనిపోయాడని పోస్ట్ మార్టం నివేదిక లో తేలింది.