Bhadrachalam News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాచలంలోని సలీం టీ స్టాల్ ముందు కాలనీలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్థుల భవనం ఒక్కసారిగా ఆకస్మాత్తుగా కూలడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీల సమాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాస్ రావు పారిపోయాడు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..