Road Accident: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే చనిపోయారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కర స్నానానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భూపాలపల్లి, కాటారం మధ్య మేడిపల్లి ప్రాంతంలో ఆటో, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు వీరి ఇద్దరినీ క్షతగాత్రులను వెంటనే ఎంజీఏం ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిని ఒకే కుటుంబానికి చెందిన విష్ణు, రజితలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Viral Video: HYD సిటీ బస్సులో షాకింగ్ ఘటన.. బస్సుకు వేలాడుతూ డ్రైవర్‌ను.. వీడియో వైరల్