Guntur suicide case: ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యల ఖాతాలోకి మరో ఘటన చేరింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి లో బుధవారం వెలుగులోకి వచ్చింది. అయితే వివాహేతర సంబంధం కారణంగా సెల్ఫీ సూసైడ్ జరిగినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లా తాడేపల్లి కి చెందిన బ్రహ్మయ్యకు ఏడాది క్రితం కౌసల్యతో వివాహం జరిగింది. అయితే పెళ్లిచూపుల సమయంలోనే మూడో రోజే బ్రహ్మయ్య తండ్రి అకస్మాత్తుగా కన్నుమూశారు. దీనితో కౌసల్యతో వివాహం వద్దని పెద్దలు వారించినా, బ్రహ్మయ్య ససేమిరా అంటూ ఆమెను వివాహం చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత వారి దాంపత్య జీవితం ఆనందదాయకంగా సాగుతూ వచ్చింది.
Also Read: Shivamogga bridge: కాస్త టైమ్ ఉందా? ఈ కేబుల్ బ్రిడ్జిపై జర్నీ ప్లాన్ చేసేయండి!
అయితే ఊహించని రీతిలో కొన్ని నెలల నుండి తరచూ.. ఘర్షణలు చోటుచేసుకుంటున్న వాతావరణం, ఆ కుటుంబంలో నెలకొంది. భార్యాభర్తల మధ్య విభేదాలు అధికం కాగా, తరచూ గొడవలు జరిగేవి. కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుంటూ ఇద్దరికీ సర్ది చెప్పేవారు. ఈ తరుణంలోనే బ్రహ్మయ్య హఠాత్తుగా సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు.
తన చావుకు గల కారణాలు తెలిపి, బ్రహ్మయ్య సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, కౌసల్యకు వివాహేతర సంబంధం ఉండడంతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు బ్రహ్మయ్య తల్లి ఆరోపించారు. మొత్తం మీద తాడేపల్లిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుత సంచలనంగా మారింది.
భార్యతో గొడవలు.. యువకుడు సెల్ఫీ సూసైడ్..
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘటన
ఏడాది క్రితం కౌసల్యతో బ్రహ్మయ్య(29) వివాహం
పెళ్లి చూపులు జరిగిన మూడో రోజే బ్రహ్మయ్య తండ్రి మృతి
కౌసల్యతో వివాహం వద్దూ అన్నా వినిపించుకోకుండా వివాహం చేసుకున్న బ్రహ్మయ్య
పెళ్లి అయిన రోజు నుంచీ దంపతులు మధ్య… pic.twitter.com/mLyyMqnY4R
— ChotaNews App (@ChotaNewsApp) July 16, 2025