Konaseema Crime: ఆ మహిళకు పెళ్లయ్యింది.. కాకపోతే కొన్ని పరిస్థితుల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది. అదే సమయంలో ఆమె జీవితంలో మరో వ్యక్తి ఎంటరయ్యాడు. తోడు ఉంటాడని భావించింది ఆ యువతి. చావుని ఆహ్వానించాననే విషయాన్ని గమనించలేకపోయింది. వ్యభిచారానికి ఒప్పుకోలేదని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపి ఆగ్రహం చల్లార్చుకున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన కోనసీమ జిల్లాలోని రాజోలు మండలంలో వెలుగు చూసింది.
కోనసీమ జిల్లా 22 ఏళ్ల పుష్పకు కొన్నాళ్ల కిందట పెళ్లయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ భర్తతో విడిపోయి ఒంటరి ఉంటోంది. అదే సమయంలో ఆమె జీవితంలోకి ఓ యువకుడు ఎంటరయ్యాడు. వాడి పేరు షేక్ షమ్మం. కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. తొలుత పుష్పతో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి సిద్ధార్థనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారు.
ఆ తర్వాత మెరకపాలెం గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటుపడ్డాడు షేక్ షమ్మం. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు కోసం పుష్పను వ్యభిచార వృత్తిలోకి దింపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. తన ప్రియురాలు అంగీకరించలేదని ఆగ్రహంతో రగిలిపోయాడు.
తాగిన మత్తులో కత్తితో ఆమెని పొడిచి పొడిచి తన కోపాన్ని తీర్చుకున్నాడు. ఆమె విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. ప్రియురాలు పుష్ప మృతి చెందడంతో భయపడ్డాడు. ఇంటి నుంచి సైలెంట్‌గా జారుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
ALSO READ: అడ్డు వస్తున్నాడని భర్తను లేపేసిన భార్య, లవర్, కొడుకుతో కలిసి
షేక్ షమ్మం ఫోన్ వినియోగించడని తెలుస్తోంది. ఈ లెక్కన షమ్మిని ట్రాక్ చెయ్యడం పోలీసులకు కత్తిమీద సాము మాదిరిగా మారింది. పుష్ప హత్య నేపథ్యంలో స్థానికులు షమ్మంపై మండిపడు తున్నాడు. షమ్మంని నమ్మడం పుష్ప చేసిన పెద్ద నేరమని అంటున్నారు. భర్త లేక తోడు కోసం అతడ్ని ఎంచుకోవడం తప్పైపోయింది. ఆమెని డబ్బులు సంపాదించే వస్తువు మాదిరాగా చూశాడు అంటున్నారు.